ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
శ్రీకాంత్, జగపతిబాబు స్నేహితులుగా నటించిన ‘మనసులో మాట’ సినిమాలో జగపతి బాబు చెల్లెలిగా నటించిన మహిమా చౌదరి గుర్తు ఉందా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా? ఆమె షారుఖ్ ఖాన్ తో ‘పరదేస్’ సినిమాలో నటించింది. ఆ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తరవాత కిలాడీ 420, దాగ్-ది ఫైర్, ఎల్ఓసి కార్గిల్, ఓం జై జగదీశ్ వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి స్టార్ డమ్ సంపాదించింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘దడ్కన్’ సినిమాలో సపోర్టింగ్ రోల్ వేసి మంచి పేరు సంపాదించింది.
అయితే మహిమా చౌదరి 2006లో వ్యాపారవేత్త అయిన బాబీ ముఖర్జీని పెళ్ళి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2011 లో వివాహ బంధంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని వార్తలు వచ్చిన… ఆ తర్వాత అవన్నీ సమసిపోయాయి. ఆమెకు 8 సంవత్సరాల అరియానా అనే కూతురు ఉంది. 2015 లో మహిమ చౌదరికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందని వార్తలు రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని మహిమ చౌదరి కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆమె కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది ఈ భామ.