ప్రస్తుత పరిస్థితిలో పవన్ సినిమా చేస్తే లాభమా.. నష్టమా..?
పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనుకోవడం ఫ్యాన్స్ కు నిజంగా పండగే. ఆయన సినిమా చేస్తుంటే చూడాలనేది నార్మల్ ఆడియన్స్ కోరిక కూడా. కానీ ఆయనే వినకుండా రాజకీయాల వైపుగా వెళ్లారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈయన దృష్టి సినిమాపై పడిందని తెలుస్తుంది. అయితే ఎన్నికలు ఇంకా ఆర్నెళ్లు కూడా లేని ఈ సమయంలో ఆయన సినిమా వైపు వెళ్లడం నిజంగా కరెక్టేనా..? అసలు పవర్ స్టార్ ఇప్పుడు చేస్తే ఆడియన్స్ చూస్తారేమో కానీ ఆయనకు జనాన్ని కలిసే టైం మిస్ కాదా.. అసలే సినిమా వాడు వచ్చి రాజకీయాల్లో ఏం చేస్తాడు అంటూ ఓ వైపు బాబు.. మరోవైపు జగన్ విమర్శిస్తున్న వేళ ఆయన కానీ ఇప్పుడు సినిమా చేసాడంటే ప్రజల కంటే సినిమాలే ఎక్కువయ్యాయా అంటూ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టరా..? ఇలా పవన్ సినిమా చేయాలని ఉన్నా కూడా చాలా కారణాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈయన రామ్ తళ్లూరి నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఎన్నికల ముందే చేయాలనుకుంటున్నా కూడా అది అంత ఈజీ అయితే కాదు. అది కూడా పొలిటికల్ సినిమా చేస్తానంటున్నాడు.. పార్టీ మైలేజ్ కు కూడా పనికొస్తుంది అది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ప్రజల్లో ఉండడమే కరెక్ట్ అని.. ఇలాంటి టైమ్ లో సినిమాలు చేస్తే అసలుకే మోసం వస్తుందనే వాళ్లు కూడా లేకపోలేదు. మరి చూడాలిక.. పవర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?