Movies

కృష్ణవంశీ జీవితంలో జరిగిన ఈ సంఘటనలు మీకు తెలుసా? నమ్మలేని నిజాలు

గులాబీ మూవీతో సృజనాత్మక డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణవంశీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. రమ్యకృష్ణ ను లవ్ చేసి పెళ్లాడిన యితడు సమాజానికి సందేశం ఇవ్వాలని తపించేవారిలో ఒకడిగా నిలిచాడు. త్రిపురనేని వరప్రసాద్ దగ్గర సహాయకునిగా పనిచేసిన కృష్ణవంశీ ఆతర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర చేరాడు. అక్కడ ఉండగానే ‘అనగనగా ఒకరోజు’ మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. బడ్జెట్ ఎక్కువ కావడంతో తప్పించారు. అయితే అతడి టాలెంట్ ని చూసిన వర్మ గులాబీ మూవీతో మరో ఛాన్స్ ఇవ్వడం, ఈ మూవీ ఘన విజయం అందుకోవడం జరిగిపోయాయి.

1962జులై 27న తాడేపల్లి గూడెంలో జన్మిచిన కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి బంగార్రాజు. అయితే ఎన్నో పుస్తకాలు చదివిన ఈయన తనపేరును వంశీకృష్ణగా గా మార్చుకున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేస్తున్న సమయంలో ఆయన సలహాతో కృష్ణవంశీగా మార్చుకున్నాడు. 2003లో హీరోయిన్ రమ్యకృష్ణను వివాహం చేసుకున్నారు.

గులాబీ మూవీలో పాటల గురించి ఇండస్ట్రీలో అందరూ అప్పట్లో మాట్లాడుకోవడంతో,ముఖ్యంగా చిత్రీకరణ అదిరిందన్న టాక్ నడిచింది. దీంతో అక్కినేని నాగార్జున మెచ్చుకుని, తాను తీసిన నిన్నే పెళ్లాడుతూ మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ కావడంతో కృష్ణవంశీ స్టార్ డైరెక్టర్ అయ్యాడు.సింధూరం సినిమాతో నక్సల్స్ కష్ఠాలను,ఇబ్బందులను అద్భుతంగా చిత్రీకరించడంతో మంచి పేరు వచ్చినా,నిర్మాత కూడా ఆయనే కావడంతో ఆర్ధికంగా నష్ఠాలను చూడాల్సి వచ్చింది.

ఇక ఆతర్వాత నాగ్ తో చంద్రలేఖ అనుకున్నస్థాయిలో పేరు రాకపోయినా, అంతః పురం,సముద్రం మురారి,ఖడ్గం చిత్రాలతో విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇందులో అంతః పురం మూవీని శక్తి పేరుతొ రీమేక్ చేసారు. శ్రీ ఆంజనేయం,చక్రం,డేంజర్,రాఖి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా అందులో క్రియేటివిటీ,సాంకేతికత అందరిని ఆకర్షించాయి. ఆతర్వాత చందమామ మూవీతో మంచి ఫామ్ లోకి వచ్చినా , ఆతర్వాత ఆయన నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు.