Movies

శేఖర్ మాస్టర్ కొడుకు కి డాన్స్ నేర్పేదెవరో తెలుసా? శేఖర్ మాస్టర్ ఎందుకు నేర్పటం లేదో తెలుసా?

ఒకప్పటి కంటే ప్రస్తుతం సినిమాల్లో కొరియోగ్రాఫర్స్ కి మంచి డిమాండ్ ఉంది. స్టెప్పులకు ప్రాధ్యాన్యత ఏర్పడడం,హీరోలందరూ డిఫరెంట్ స్టెప్పులతో హోరెత్తించాలని ఆరాటపడడం వంటి కారణాలతో డాన్స్ మాస్టర్ లకు గిరాకీ వచ్చింది. అందుకే ఢీ లాంటి షోలకు విశేష స్పందన వస్తోంది. ఇక ఎవరైనా ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తు,వచ్చాక నిలదొక్కుకోవడం మరోఎత్తు. డాన్స్ మాస్టర్ శేఖర్ 17ఏళ్ళ వయసులో రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చాక తన టాలెంట్ తో దూసుకెళ్తున్నాడు.

ఇండస్ట్రీలో ఉంటూనే ఢీ 10ప్రోగ్రాం కి జడ్జిగా వచ్చాడు. అంతటితో కాకుండా ఈటీవీలో వస్తున్న ఢీ జోడి షోకి కూడా జడ్జిగానే కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల పండగ రోజుల్లో ఈటివి నిర్వహించిన సందడి షోల్లో హడావిడి చేసిన శేఖర్ మాస్టర్ భార్య పేరు సుజాత. వీళ్లకు గల కొడుకు పేరు వెన్ని. కొన్ని రోజులక్రితం ఢీ జోడి షోలో వెన్ని డాన్స్ తో తళుక్కున మెరిసి అందరికీ షాకిచ్చాడు.

వెన్ని డాన్స్ షో మొత్తానికి హైలెట్ అయింది. వెన్ని డాన్స్ చేస్తుంటే శేఖర్ మాస్టర్ కూడా స్టేజి ఎక్కి కొడుకుతో కల్సి స్టెప్పులు వేసాడు. దీంతో అందరూ హర్షధ్వానాలతో షోని మోతమోగించారు. అయితే అతడు డాన్స్ ఎక్కడ నేర్చుకుంటున్నాడో తెలుసా. మరో డాన్స్ మాస్టర్ అయిన ఎస్ మాస్టర్ దగ్గరట. ఎంతో కష్టపడి పైకొచ్చిన ఎస్ మాస్టర్ అంటే తనకెంతో ఇష్టమని కూడా శేఖర్ మాస్టర్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.

కొడుకుకి డాన్స్ అంటే గల ఇంటరెస్ట్ గమనించిన శేఖర్ మాస్టర్,తాను బిజీగా ఉండడం వలన డాన్స్ నేర్పాలని ఎస్ మాస్టారుకి చెప్పాడట. ఒక డాన్స్ మాస్టర్ తన కొడుక్కి డాన్స్ నేర్పమని అడగడం గొప్పగా ఫీలవుతూ, ఆనందంగా నేర్పుతున్నాడు. ఇక నెటిజన్లు స్పందిస్తూ రియల్లీ గ్రేట్ అంటూ ఎస్ మాస్టర్ పొగడ్తల జల్లు కురిపించారు.