ప్రేమ పావురాలు సినిమాలో నటించిన భాగ్య శ్రీ మీకు గుర్తు ఉందా… ఆమె సినిమాలకు దూరం కావటానికి కారణాలు తెలిస్తే షాక్ అవుతారు
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా మై నే ప్యార్ కియా సినిమాలో భాగ్య శ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతొ విడుదల చేసారు. ఆ సినిమా హిందీ,తెలుగు రెండు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. భాగ్య శ్రీ మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఆమెకు ఆ సినిమా చాల స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. వరుస అవకాశాలు తలుపు తట్టిన ఆమె పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే భాగ్య శ్రీ హిమాలయ దాసాని ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు. పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు
వీరి ప్రేమను హిమాలయ దాసాని తల్లి తండ్రులు ఒప్పుకున్నారు కానీ భాగ్య శ్రీ తల్లి తండ్రులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. దాంతో వీరు కొంత కాలం విడిపోయారు. హిమాలయ దాసాని పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాయడు ఆ సమయంలో భాగ్య శ్రీ కి మై నే ప్యార్ కియా సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఆమె హిమాలయ దాసాని తల్లి తండ్రుల వద్దకు వెళ్లి సినిమా అవకాశం వచ్చింది మీకు అభ్యంతరం లేకపోతె నటిస్తా అని వారిని అడిగిందట. వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవటంతో సినిమా ను ఒప్పుకుంది
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయంలో హిమాలయ దాసాని అమెరికా నుండి ఇండియా వచ్చాడు. దాంతో భాగ్య శ్రీ మరల తల్లి తండ్రులను హిమాలయ దాసాని ని పెళ్లి చేసుకుంటానని అడిగింది తల్లి తండ్రులు ఒప్పుకోకపోవడంతో హిమాలయ దాసాని ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను తీసుకువెళ్ళు లేకపోతె నేనే బయటకు వెళ్లిపోతున్నా అని చెప్పింది.
అప్పుడు హిమాలయ దాసాని 15 నిమిషాల్లో వచ్చి భాగ్య శ్రీ ని తీసుకు వెళ్లి గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లిని మై నే ప్యార్ కీయ హీరో సల్మాన్ ఖాన్,నిర్మాత , హిమాలయ దాసాని తల్లి తండ్రులు హాజరు అయ్యారు
భాగ్య శ్రీ పెళ్లి అయ్యాక మై నే ప్యార్ కీయ సినిమా విడుదల అవ్వటం సూపర్ డూపర్ హిట్ అవ్వటం ఎన్నో రికార్డ్ ని బద్దలు కొట్టటం జరిగింది. ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చిన వేటిని ఒప్పుకోకుండా కుటుంబానికి పరిమితం అయింది.
వీరికి అభిమన్యు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. భాగ్య శ్రీ ఇప్పుడు సినిమాలో నటించటానికి తీరిక దొరికిందట మంచి అవకాశాలు వస్తే నటించటానికి సిద్ధం అంటుంది భాగ్య శ్రీ.