Devotional

Poli Swargam:పోలి పాడ్యమి(మార్గశిర పాడ్యమి) రోజు తెల్లవారుజామున ఏమి చేస్తే కోటి జన్మల పుణ్యం,అఖండ ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా?

Poli Swargam:నవంబరు 2 న ప్రారంభమైన కార్తీకమాసం డిసెంబరు 01 ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది. ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి, పోలి స్వర్గం అంటారు. ఈ రోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీకమాసం పూర్తవుతుంది.

నెల రోజుల పాటూ కార్తీకమాస నియమాలు అనుసరించినవారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. ఇంతకీ ఆ రోజుని పోలి స్వర్గం అని ఎందుకంటారు? ఎవరా పోలి? దీనికి సంబంధించి కార్తీక పురాణంలో ఓ కథ ఉంది…

మన సంప్రదాయంలో ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసం ఎంతోపవిత్రంగా భావిస్తారు. వేకువఝామున లేవడం,నదీలోనో చెరువులోనో లేదా ఇంటిదగ్గరో చన్నీటి స్నానం చేయడం,నదిలో చెరువులో దీపాలు వదలడం చేస్తారు. శివాలయాల్లో దీపారాధన , అభిషేకాలు, పూజలు చేస్తారు. అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర పాడ్యమి ఒక ఎత్తు అంటారు.

కార్తీకం నెల్లాళ్ళు దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో,మార్గశిర పాడ్యమి నాడు ఒక్కరోజు చేసే దీపారాధన కూడా అంతే ఫలితం ఇస్తుందని చెబుతారు. అయితే ఆరోజు పూజా విధానం ఎలా చేయాలనే దానిపై ఎవరి రీతిలో వారు చెబుతుంటారు. అయితే అసలు ఏం చేయాలనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం.

మార్గశిర పాడ్యమి వేకువఝామున లేచి, ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానమాచరించి,పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి,ఆకాశంలో కృత్తికా నక్షత్ర దర్శనం చేసుకుని ,అప్పుడు తులసి కోట దగ్గర నేతి దీపాన్ని వెలిగించి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసం నెలరోజులు కలిపి రోజుకొక వత్తి చొప్పున 31వత్తులను వెలిగించి, నీటిలో వదిలిపెట్టాలి.

దీపం వెలిగించి పసుపు ,కుంకుమ, అక్షింతలు జల్లి,చలిమిడి,వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. అరటి దొప్పలో వత్తులను ఉంచి నీటిలో వదిలిపెట్టాలి. దీపాన్ని సాగనంపుతున్న విధంగా నీటిని మూడు సార్లు ఎదరకు తోయాలి. ఓ తల్లి పసుపు కుంకుమ తీసుకుని,మాకు కూడాపసుపు కుంకుమ ప్రసాదించు తల్లీ అని వేడుకోవాలి. అలాగే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ద్వారా మమ్మలిని చల్ల గా చూడు తల్లి అని అర్ధం.

ఇలా నదిగాని,చెరువు గాని, ఎరుగని,కొలను గానీ లేనివాళ్లు,అక్కడకు వెళ్లలేని వాళ్ళు ఇంటిదగ్గర తులసి కోట దగ్గర ఓ పెద్ద పాత్రలో నీళ్లు పోసి, ఆనీటిలో అరటి దొప్పలతో వదలినా సరే ,ఫలితం వస్తుంది. అప్పుడు పోలి కథను చెప్పుకోవాలి. ఓ ఊళ్ళో ఓ చాకలి ముసలావిడకు ఐదుగురు కోడళ్ళు ఉన్నారు.

ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకూ నలుగురు కోడళ్లను వెంటబెట్టుకుని ఏటిలో స్నానం చేసి, దీపాలు పెట్టుకుని వచ్చేవారు. ఆఖరి కోడల్ని తీసుకెళ్లేవారు కాదు. అయితే అమావాస్య నాడు కూడా చిన్న కోడలు ‘పోలి’ ని వదిలేసి, మిగిలినవాళ్లను తీసుకుని వెళ్తుంది.

అయితే చిన్న కోడలు కవ్వంతో పెరుగు చిలికి వచ్చిన వెన్నతో వత్తిని వెలిగించి దీపం పెడ్తుంది. అత్తగారు,తోడికోడళ్లు వస్తారన్న భయంతో ఆ దీపంపై చాకలి బాన బోర్లిస్తుంది. అయితే భక్తిగా ఆమె దీపం పెట్టడాన్ని మెచ్చి దేవతలు ఓ పుష్పక విమానాన్ని పంపించి,బొందితో కైలాసానికి తీసుకువెళ్తుంటారు. ఊళ్ళో వాళ్లంతా ఈ సంఘటనను వింతగా చూస్తూ,చాకలి పోలి స్వర్గానికి వెళ్తోందని అరుస్తారు. అయితే మిగిలిన వాళ్ళు కూడా ఆమె కాళ్ళు పట్టుకుని స్వర్గానికి వెళదామని ప్రయత్నిస్తారు.

అయితే పోలి భక్తిగా దీపం పెట్టిందని,అందుకే కైలాసానికి వెళ్తోందని దూతలు చెప్పి అందరిని కిందికి తోసేస్తారు. ఇలా అప్పటినుంచి,మార్గశిర పాడ్యమి నాడు పోలి స్వర్గం అంటూ గుర్తుచేసుకుంటూ దీపాలు వెలిగిస్తారు. అందుకే భక్తితో ఒకరోజు చేసినా ఫలితం వస్తుందని గ్రహించాలి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u