Movies

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎంత మంది హీరోలు, హీరోయిన్స్ ఉన్నారో తెలుసా?

విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా తీస్తున్న సినిమా తొలిభాగం జనవరి 9న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బాల్యం నుంచి సినిమా జీవితం వరకూ కథానాయకుడు పేరిట మొదటి భాగం శరవేగంగా పూర్తవుతోంది. ఇక రాజకీయ జీవితాన్ని జోడించి రెండవభాగం మహానాయకుడు జనవరి 24న విడుదల కానుంది. తెలుగు సినీ చరిత్రలో గొప్ప నటుడిగా పేరుతెచ్చుకుని రాజకీయాల్లో చేరి ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ మహానాయకుడి జీవితంపై వస్తున్న సినిమా ఇది. తొలిభాగం కథానాయకుడు ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఫోకస్ చేసే మూవీ కావడంతో ఆయనతో నటించిన హీరోయిన్స్ ని ఇందులో చూపించబోతున్నారు. దాదాపు 9మంది హీరోయిన్స్ సందడి చేస్తారు.

ఇక బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్,మాళవిక నాయర్ కృష్ణకుమారి పాత్రలో,అలాగే సావిత్రి పాత్రలో నిత్యామీనన్,షాలిని పాండే షావుకారు జానకి పాత్రలో నటిస్తుంటే, హన్సిక జయప్రద పాత్రలో, పాయల్ రాజ్ జయసుధ పాత్రలో, రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి పాత్రలో నటించబోతున్నారు.

అలాగే ఈషా రెబ్బ, దివ్యవాణి,ఆమని, పూనమ్ బజ్వా,మంజిమా మోహన్ తదితరులు నటిస్తున్నారు. నారా, నందమూరి కళ్యాణ్ రామ్,సుమంత్ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. మురళీ చందర్, భానుచందర్,ప్రకాష్ రాజ్,సంజయ్ రెడ్డి,లవకిషన్,వెన్నెల కిషోర్,భరత్ రెడ్డి ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.

ఇద్దరు స్టార్స్ కల్సి నటిస్తే,మల్టీస్టార్ మూవీ అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ పదుల సంఖ్యలో స్టార్ హీరోలు , హీరోయిన్స్ నటిసున్న ఎన్టీఆర్ మూవీని ఇక ఎలా చెప్పుకోవాలి మరి. ఈ మధ్య సౌత్ లో అతధికంగా ప్రముఖ నటులు నటించిన సినిమా కూడా ఇదేనని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ఓ యజ్ఞంలా చేస్తున్నాడు.