Movies

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ బాల నటుణ్ని గుర్తు పట్టారా…. ఏ సినిమాలో నటిస్తున్నాడో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఒక్కటే కాదు,బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అంటారు. అయితే చైల్డ్ ఆర్టిస్టుల నుంచి పని చేసేవాళ్లకు పెద్దయ్యాక మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామంది నిరూపించారు. ఇక కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా సక్సెస్ అయినా కూడా పెద్దయ్యాక హీరోలుగా రాణించలేకపోవచ్చు. కొందరు చైల్డ్ ఆర్టిస్టులు దుమ్మురేపి,స్టార్ హీరోలుగా , హీరోయిన్స్ గా ఎదుగుతారు. అ తరహాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో దూసుకెళుతున్నాడు. అతడి పేరు మహేంద్రన్. తెలుగు కుర్రాడైన మహేంద్రన్ పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి,ఇప్పుడు తమిళంలో హీరోగా ఇంట్రీ ఇస్తున్నాడు.

పెదరాయుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మోహన్ బాబు నటించిన ఈ సినిమాలో పెదరాయుడు తండ్రి పాపారాయుడుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించాడు. అటు రజనీకాంత్,ఇటు మోహన్ బాబు డబుల్ రోల్స్ తో అద్భుత నటనతో అదరగొట్టారు. ఈ సినిమాలో ఒక అమ్మాయిని ని రేప్ చేసిన ఘటనలో సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అని పాపారాయుడు పాత్ర రజనీకాంత్ అడుగుతాడు.

అప్పుడు పాపారాయుడు మేనల్లుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. ఆ సమయంలో నేను చెబుతాను అంటూ జనం గుంపులోంచి ముందుకొస్తాడు. అలా ముందుకొచ్చిన కుర్రాడు చెప్పిన సాక్ష్యంతో పాపారాయుడు సమంజసమైన తీర్పు వెలువరిస్తాడు. అలా సాక్ష్యం చెప్పిన కుర్రాడే, మహేంద్రన్. మూడేళ్ళ వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్టుగా రంగప్రవేశం చేసిన యితడు తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో చేసాడు. పెదరాయుడు,ఆహా, పెళ్లిచేసుకుందాం,దేవి, లిటిల్ హార్ట్స్,సింహాద్రి ,వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వేసి,తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న మహేంద్రన్ ఎన్నో నంది అవార్డులు,ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు ఓ తమిళ సినిమాతో హీరోగా రాబోతున్నాడు. మూడేళ్ళ వయస్సునుంచి ఇండస్ట్రీలో గల యితడు పాతికేళ్ల వయస్సుకు చేరాడు. అన్ని భాషల్లో కల్పి, దాదాపు 130సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ఇలా బాలనటుడిగానే బిజీగా ఉంటూ ఏ చైల్డ్ ఆర్టిస్టు నటించనన్ని సినిమాలతో దూసుకెళ్లిన మహేంద్రన్ ఇపుడు హీరోగా కూడా తన సత్తా చాటుతాడేమో చూద్దాం.