Health

జ్యూస్ త్రాగుతున్నారా…. అయితే జ్యూస్ త్రాగే ముందు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి…

మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు ఎప్పటికప్పుడు బయటకు పంపటానికి కూరగాయలు,పండ్ల రసాలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా శరీరం డిహైడ్రేడ్ కాకుండా యాక్టివ్ గా ఉండటానికి చాలా బాగా సహాయపడతాయి. అసలు ఏ జ్యుస్ లు త్రాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

బీట్ రూట్ జ్యుస్
బీట్ రూట్ జ్యుస్ త్రాగటం వలన శరీరం చాలా ఏక్టివ్ గా ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరగటానికి దోహదం చేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్నిసంరక్షించటమే కాకుండా శరీర రోగ నిరోధక శక్తిని పెంచటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

ఆరెంజ్ జ్యుస్
ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. చర్మం తొందరగా ముడతలు పడకుండా చేస్తుంది. అంతేకాక సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.

కీరా జ్యుస్
ప్రతి రోజు క్రమం తప్పకుండా కీరా జ్యుస్ ని త్రాగటం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ జ్యుస్ బాగా సహాయాపడుతుంది. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి.

టమోటా జ్యుస్
టమాటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మంలో జిడ్డు తగ్గి కాంతివంతంగా మారుతుంది. రక్త సరఫరా మెరుగు అవుతుంది.

క్యారెట్ జ్యూస్
క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా సమృద్ధిగా ఉండుట వలన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే చర్మాన్ని సంరక్షిస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పంపటానికి కూడా సహాయపడుతుంది.

దానిమ్మ జ్యూస్
చర్మాన్ని సంరక్షించడంలో, క్యాన్సర్ కణాలను బయటకు పంపడంలో దానిమ్మ పండు జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ద్రాక్ష పండ్ల రసం
ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం ఈ జ్యూస్‌ను సేవిస్తే చర్మం సురక్షితంగా ఉంటుంది. రక్త సరఫరా పెరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది.