Politics

ఇషా అంబానీ – ఆనంద్ పిరమల్ పెళ్లి లో అసలు వింత ఏమిటో తెలుసా

పెళ్లంటే నూరేళ్ళ పంట. ఇందుకోసం భూదేవి అంత అరుగు ,ఆకాశమంత పందిరి అంటారు. మామూలు పెళ్లిళ్లే వీరలెవెల్లో జరుగుతుంటే, మరి గొప్పింటి పెళ్లిళ్లు అయితే ఇక చెప్పాలా? అందునా రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా దంపతుల ముద్దుల కుమార్తె, ఈషా అంబానీ పెళ్లి అంటే అసలు చెప్పక్కర్లేదు. ఇక మగ పెళ్లివారు అయితే పిరమల్ గ్రూప్ అధినేత కి ఒక్కగాన ఒక్క కొడుకు ఆనంద్ పిరమల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగానే సాగింది. బాలీవుడ్ లో సెలబ్రిటీలే కాదు, దేశవిదేశాల్లో రిలయన్స్ గ్రూపులోని వాటాదారులు,పెట్టుబడి దారులు,షేర్ హోల్డర్స్,దేశంలోని సినీ ,రాజకీయ,వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు.

పెళ్లి వేదిక అయిన ముఖేష్ అంబానీ స్వగృహం అంటిలియాను దేశవిదేశాల నుంచి తెచ్చిన పూలు,విధ్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. అనంతరం పెళ్లి కూతురు ఈషా అంబానీని సోదరులు ఆకాష్, సంతోష్, అనిమోల్ తదితరులు ముత్యాలతో అలంకరించిన చాదర్ పట్టీ మండపానికి తీసుకొచ్చారు. నృత్య బృందాలు,రోయర్స్ రోలస్ రోయర్స్ కార్లతో కల్సి తన కుటుంబ సభ్యులతో పెళ్ళికొడుకు పిరమల్ ఆనంద్ అక్కడికి చేరాడు.

అంబానీ కొడుకులు, ముఖేష్ , అనిల్ లు పెళ్లి కొడుకు ఆనంద్ పిరమల్ ను మండపంలోకి తీసుకెళ్లారు. ఆనంద డోలికల నడుమ సాగిన ఈ వివాహ వేడుక సందర్బంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అమితాబ్ దంపతులు, సూర్య,అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య,సల్మాన్ ఖాన్,సచిన్,అంజలి, అమీర్ ఖాన్,కిరణ్ రావు,ప్రియాంక చోప్రా,నిక్ జోనస్,అనిల్ కపూర్,సోనమ్ కపూర్,దీపికా పడుకునే, కరీనా కపూర్,కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు,కేంద్రమంత్రులు తదితరులు హాజరైన ఖరీదైన పెళ్లి వేడుకగా నిల్చింది.