హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ గురించి షాకింగ్ విషయాలు…నమ్మలేరు
ఒకప్పుడు ప్యారడైజ్ టాకీస్ కి అనుబంధంగా ఏర్పడిన టీ, సమోసాతో నడిచే దుకాణం కాలక్రమేణా ప్యారడైజ్ బిర్యానీ సెంటర్ గా జగద్వితం అయింది. సికింద్రాబాద్ లో ఉండే ఈ థియేటర్ కి అనుబంధంగా ఇరాన్ నుంచి వచ్చిన హుస్సేన్ హిమ్మతి నిర్వహణలో నడిచే చాయ్,సమోసా కొట్టు నెమ్మదిగా ఎదిగింది. టాకీస్ పోయినా, ఈ కొట్టు ఎదిగి,ప్యారడైజ్ బిర్యానిగా రూపాంతరం చెందింది. మొదట్లో అంటే 1953లో పదిమందితో ప్రారంభమైన ఈ కొట్టు 2014 నాటికి 800మంది కి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. అంతేకాదు హైద్రాబాద్ పేరు చెప్పగానే ఒకప్పుడు ముత్యాలు,వజ్రాలు గుర్తొస్తే, కాలక్రమంలో ప్యారడైజ్ బిర్యానీ గుర్తొచ్చేలా ఇది ఎదిగింది. చెన్నై,దుబాయ్,ఢిల్లీ ప్రాంతాలకు విమానాల్లో పార్సిల్స్ వెళ్తాయి.
సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ ఇప్పటికీ కోట్లాది రూపాయల టర్నోవర్ తో నడుస్తోంది. నిత్యం వేలాది మంది పాసింజర్స్ ఎంజీవీఎస్ కి వచ్చి వెళ్తూ ఇక్కడి బిర్యానీ తీసుకెళ్లారు. హైటెక్ సిటీ,ఎన్టీఆర్ గార్డెన్స్,కూకట్ పల్లి,బేగంపేట,బస్టాండ్ ఇలా పలుచోట్ల బ్రాంచీలు కూడా వెలిశాయి. వెజ్,మటన్,చికెన్ బిర్యానీలతోపాటు కబాబ్ లు, రకరకాల ఫ్లేవర్ చాయ్ లు,సమోసాలు,కేకులు,ఐస్ క్రీమ్ లు,లస్సీలు, ఇలా ఎన్నో వెరైటీలు ఇక్కడ లభిస్తాయి.
పైగా తక్కువ ధరకే నాణ్యమైన బిర్యానీ ఇక్కడ లభిస్తుంది. అందుకే ప్యారడైజ్ బిర్యానికోసం జనం క్యూ కడతారు.గవాస్కర్, కపిల్ దేవ్ , డాక్టర్ మర్రి చెన్నారెడ్డి,డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి,రాహుల్ గాంధీ,పురంధరేశ్వరి,ప్రియదత్,కోహ్లీ,జ్యోతిరాదిత్య,షారుక్ ఖాన్,అమీర్ ఖాన్,అమితాబ్,సచిన్ పైలెట్ ,మాధురి దీక్షిత్,ప్రిన్స్ మహేష్ బాబు,వంటి సెలబ్రిటీలు ప్యారడైజ్ బిర్యానీకి ఫేవరెట్స్.
విజయవాడ,విశాఖ, ముంబయి,చెన్నై,ఢిల్లీ,వంటి నగరాలకు కూడా ప్యారడైజ్ హోటళ్లు విస్తరిస్తున్నారు. హుస్సేన్ హిమ్మతి కొడుకులు అలీ హిమ్మతి,ఖాజిమ్ హిమ్మతిలు వరల్డ్ వైడ్ లో గుర్తింపు వచ్చేలా ప్యారడైజ్ బిర్యానీ అభివృద్ధి చేసారు. ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లు మొత్తం రెండున్నర లక్షల చదరపు అదుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే బిర్యానీ కోసం వస్తువులను ఆయా ప్రదేశలనుంచి రప్పిస్తారు. బాసుమతి బియ్యాన్ని ఢిల్లీనుంచి,సుగంధ ద్రవ్యాలను కాశ్మీర్ నుంచి,ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు.
హైదరాబాద్ చెంగిచర్ల నుంచి మాంసం,గరంమసాలా ,తృణ ధాన్యాలను బేగం బజార్ నుంచి తెస్తారు. ఇక సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారికే ఉపాధి కల్పిస్తారు. ప్యారడైజ్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడంతో నాణ్యత లేదని మూసివేసి,మళ్ళీ కొత్త హంగులతో సత్తా చాటుతున్నారు.