Movies

సెలబ్రిటీ డైవర్స్ ఎంత ఖరీదైనవో తెలుసా?

ప్రముఖుల యొక్క జీవన విధానంలో బ్రేక్ అప్స్,లింక్ అప్స్, వివాహాలు మరియు విడాకులు, పుకార్లు మరియు మోసాలు అన్ని సర్వ సాధారణం అయ్యిపోయాయి. ఇప్పుడు అత్యంత ప్రసిద్ది చెందిన బాలీవుడ్ సెలబ్రిటీల డైవర్స్ గురించి తెలుసుకుందాం.

హృతిక్ రోషన్, సుజానే ఖాన్

ఈ జంట 2013 లో డైవర్స్ తీసుకుంటామని ప్రకటించింది. దాంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి 17 సంవత్సరాల సుదీర్ఘ సంబంధానికి తెర పడింది. సుజానే 400 కోట్లను డిమాండ్ చేస్తే 380 కోట్లతో హృతిక్ సెటిల్ చేసుకున్నాడు.

కరిష్మా కపూర్ మరియు సంజయ్ కపూర్

కరిష్మా కపూర్ వివాహం ఢిల్లీ వ్యాపారి సంజయ్ కపూర్ జరిగింది. వీరి డైవర్స్ మీద చాలా రోజులు పుకార్లు వినపడ్డాయి. చివరికి డైవర్స్ తీసుకుంటున్నామని ప్రకటించారు. కరిష్మా మనోవర్తి కింద 7 కోట్లు కావాలని డిమాండ్ చేసింది.

ప్రభుదేవా మరియు రామలత

ప్రభుదేవా దక్షిణాది నటి నయనతారతో ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా 2011 లో అతని భార్య రామలతకు విడాకులు ఇచ్చాడు. ప్రభుదేవా వారి పిల్లల ఖర్చుల నిమిత్తం 20-25 కోట్ల ప్రాపర్టీని రామలతకు ఇచ్చారు.

సైఫ్ ఆలీఖాన్ మరియు అమృతా సింగ్

సైఫ్ ఆలీఖాన్ తన కుటుంబాన్ని ఎదిరించి మరీ అమృతా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 13 సంవత్సరాల తర్వాత విడిపోయారు. సైఫ్ అమృతాకు విలాసవంతమైన బంగళాతో పాటు తన సంపాదనలో సగం ఇచ్చేసాడు.

సంజయ్ దత్ మరియు రియా పిళ్ళై

రియా పిళ్ళై టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ని వదిలి వచ్చి 1998 లో సంజయ్ దత్ ని వివాహం చేసుకుంది. సంజయ్ డట్ రియా పిళ్ళై కి సుమారు 8 కోట్లకు పైగా మనోవర్తి చెల్లించాడు.