పుట్టినరోజున ఎవరు ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్న జగన్
మడమ తిప్పని పోరాట యోధుడు,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాల ఫలాలు దక్కేలా చేసారు. అదే బాటలో ఆయన కుమారుడు జగన్ కూడా పయనిస్తున్నారు. డాక్టర్ వైఎస్ ఆకస్మిక మరణంతో తెరమీదికి వచ్చిన జగన్, కాంగ్రెస్ నుంచి విడిపోయి వైస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టి, 2014ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేసాడు. కేవలం రాష్ట్రం మొత్తం మీద 5లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ అప్పట్లో 67స్థానాల వరకూ గెలుచుకున్నారు. ఓ పక్క బిజెపి,మరో పక్క పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని అధికారం దక్కించుకున్న సీఎం చంద్రబాబుకి ఈసారి ఎలాగైనా చెక్ చెప్పాలని జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నాడు. చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేయాలని ఎక్కడా బెసగ కూడదని జగన్ భావిస్తున్నాడు.
ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరిట శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ శుక్రవారం పుట్టిన రోజు వేడుకలు పార్టీ శ్రేణుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. 1972డిసెంబర్ 21న జన్మించిన జగన్ పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుతూ, అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. టెక్కలి నియాజక వర్గంలో భారీ కేకుని కట్ చేసారు.
ప్రతి పుట్టినరోజు నాడు ఏదో ఒక నిర్ణయం తీసుకునే జగన్ ఈసారి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి విజయం సాధించిన కేసీఆర్ బాటలోనే చంద్రబాబు కూడా ముందుగానే అంటే జనవరిలో అభ్యర్థులను ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈనేపధ్యంలో తనుకూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని జగన్ తన పుట్టినరోజు నాడు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు 60మందితో జనవరిలో తొలివిడత జాబితా ప్రకటించాలని భావిస్తుంటే,జగన్ కూడా 70మంది తో జాబితా వెల్లడించాలని కసరత్తు చేస్తున్నారట.
2014ఎన్నికల్లో అనుభవం గల నేతలు లేకపోవడం కొంత ఇబ్బంది అయిందని,అయితే ఈ ఎన్నికల్లో అనుభవం కలగలసిన నేతలు ఉన్నారని అందుకే చంద్రబాబుకి ఎట్టి పరిస్థితిలో ఛాన్స్ ఇవ్వరాదని జగన్ పట్టుదలగా ఉన్నారట. ముఖ్యంగా తమ పార్టీ తరపున నెగ్గి టిడిపి లో చేరిన నేతలు పోటీ చేస్తే, ఎట్టి పరిస్థితిలో వాళ్ల్లు గెలవకుండా చూడాలని, తద్వారా ఓ మంచి సందేశం పంపాలని జగన్ ఆలోచిస్తున్నారట. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రచారం చేసుకోడానికి వెసులుబాటు కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.