2018 జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన మంచి, చెడు సంఘటనలు
టాలీవుడ్ లో కెరీర్ అద్భుతంగా ప్రారంభమై,మధ్యలో కొన్ని సినిమాలతో తేడా కొట్టినా ఆ తర్వాత సరయిన దృష్టి పెట్టి,వరుస హిట్స్ అందుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఎందరో యువ దర్శకులు,స్టార్ డైరెక్టర్లతో కల్సి పనిచేస్తున్న తారక్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. 2018లో కొన్ని తీపి జ్ఞాపకాలు, కొన్ని విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో స్టూడెంట్ నెంబర్ వన్,సింహాద్రి,యమదొంగ వంటి హిట్స్ తో రాజమౌళి మంచి కెరీర్ బిల్డప్ చేసాడు. ఇప్పుడు మల్టీస్టారర్ పేరిట ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ తో కల్సి రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇక 2018లో రెండవ కుమారుడు భార్గవ రామ్ పుట్టడం తారక్ కుటుంబంలో ఆనందం కలిగించడంతో పాటు , అభిమానులకు సంతోషం పంచిందని చెప్పాలి.
ఇక టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్,జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ సినిమాలు వరుస విజయాలను నమోదు చేశాయి. అరవింద సమేత వీరరాఘవ మూవీ ఎన్టీఆర్ నట జీవితంలోనే అత్యధిక షేర్ కలెక్షన్స్,అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా గా నిల్చింది. ముఖ్యంగా వంద కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించిన తొలిసినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
నిజానికి అజ్ఞాత వాసి ప్లాప్ తర్వాత అరవింద సమేతతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుత హిట్ ఇచ్చాడు. కాగా ఈ ఏడాది తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ హఠాన్మరణం తీరని విషాదం మిగిల్చింది. తండ్రి మరణంతో కుప్పకూలిపోయిన ఎన్టీఆర్ తేరుకుంటాడో లేదో,అసలు అరవింద సమేత సినిమా అవుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి.
అయితే నిర్మాతలు,సహనటులు ఎవరూ నష్టపోకూడన్న ఉద్దేశ్యంతో నాలుగురోజుల్లోనే సెట్స్ కి వెళ్లి సినిమా పూర్తికావడానికి సహకరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ కి బాబాయి బాలయ్య రావడం తండ్రి స్థానంలో అండగా ఉంటానన్న సంకేతం ఇచ్చినట్లయిందని తారక్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
ఇక నందమూరి అభిమానులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అలాగే బాబాయ్ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ ఆడియో లాంచింగ్ కి తారక్ ని పిలవడం కూడా నిజంగా తీపి జ్ఞాపకమే.