Movies

బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరో తెలుసా?

ఎక్కడో విదేశాల్లో పుట్టిన బిగ్ బాస్ కాన్సెప్ట్ బాలీవుడ్ లో ఓ ఊపు ఊపేస్తోంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ విజయవంతం కావడంతో , నాని హోస్ట్ గా సీజన్ టు కూడా తారాస్థాయికి చేరింది. ఇప్పుడు మూడవ సీజన్ కి విక్టరీ వెంకటేష్ పేరు వినిపిస్తోంది. తెలుగు టివి రంగంలో అందునా రియాల్టీ షోలలో బిగ్ బాస్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ లకు స్టార్ మా లకు విపరీతంగా టిఆర్పి రేటింగ్ లభించింది. ఇక సీజన్ టులో కంటెస్టెంట్ కౌశల్ , కౌశల్ ఆర్మీ ఏకపక్షంగా షో ని నడిపించారని చెప్పాలి. కౌశల్ నెగ్గిన తీరు,ఓటింగ్ తీరు అంతా కూడా ఆశ్చర్యంలో పడేసింది.

సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ టులో నాని అభినందనలతో పాటు కొన్ని సార్లు తీవ్ర విమర్శలు కూడా చవిచూశాడు. నెటిజన్లు ఏకిపారేస్తుంటే, తట్టుకోలేక బహిరంగ స్టేట్ మెంట్ కూడా నాని ఇచ్చాడు. మొత్తానికి రెండు సీజన్స్ దిగ్విజయంగా పూర్తికావడంతో ఇక బిగ్ బాస్ తరవాత సీజన్ పై అందరి దృష్టి పడింది. సీజన్ టులో విమర్శలు ఎదుర్కొన్న నాని మూడవ సీజన్ కి వస్తాడన్న నమ్మకం లేదు.

పోనీ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఫుల్ బిజీ గా అయ్యాడు. ఇక జూన్ 3నుంచి బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ కాబోతోందని టెలివిజన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో హోస్ట్ గా వ్యవహరించాలని వెంకటేష్ ని బిగ్ బాస్ వర్గాలు సంప్రదించి, చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఎందుకంటే వివాదాలకు దూరంగా ఉండే వెంకీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. అదేసమయంలో పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు. మరి బిగ్ బాస్ షోకి ఒప్పుకుంటాడా అనిపిస్తోంది.

కంటెస్టెంట్స్ అంతా యూత్ కనుక వాళ్ళని వెంకీ బాగా కంట్రోల్ చేయగలడని బిగ్ బాస్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు ఫామిలీ ఆడియన్స్ ఎక్కువగా గల వెంకీ ఈ షో కి హోస్ట్ గా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా బాగా లభిస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.