లక్ష్మి పార్వతి మొదటి భర్తకు అక్కినేని కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
తెలుగు నాట రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన నందమూరి తారక రామారావు వ్యక్తిగత, రాజకీయ ఘటనలు అనేకం వివాదాస్పదంగా ఉన్నాయి. ఎన్టీఆర్ నష్టపోవడానికి లక్ష్మీ పార్వతి,చంద్రబాబు ఎవరు కారణమో ఏమో గానీ ఎన్టీఆర్ రెండో పెళ్లి కారణంగా తీవ్రంగా నష్టపోయింది మాత్రం లక్ష్మిపార్వతి మొదటి భర్త వీర గంధం వెంకట సుబ్బారావు. అయన ఏనాడు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేదు. ఇల్లాలు చదివితే ఇంటికి వెలుగు అనుకుని లక్ష్మీపార్వతి చేత సంస్కృతం లో ఎం ఏ చేయించారు. ఎం ఫిల్ కూడా చేయించారు. నిజానికి వీరగంధం చదివింది 8వ క్లాస్ అయినప్పటికీ బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు,ఇంగ్లీషు బాగా మాట్లాడగల దిట్ట.
తెలుగు భాషను కాపాడాలని, హిందూ మతాన్ని పరిరక్షించాలని, సంప్రదాయాలను రక్షించాలని చూడాలని తపించిన వీరగంధం 1970-80దశకాల్లో ఎంతో కృషి చేసారు. హరికథల్లో బాగా రాణించి అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వీరగంధం తాను ఎక్కడ హరికథ చెప్పినా అక్కడ ముందుగా హిందూ మత సంప్రదాయాలపై భార్య చేత ప్రసంగాలు చేయించేవారు. 1979లో అమెరికాలో హరికథ చెప్పి ,విదేశాల్లో వ్యాప్తి చేసిన ఘనత ఈయనది. అయితే లక్ష్మీపార్వతి వలన కోలుకోలేని అవమానాలకు గురయ్యారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన చేత ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పావులు కదిలించాలని భావించాయి. అయితే వీరగంధం లొంగలేదు. పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెట్టించినా సరే,ఎవరికీ అన్యాయం చేయనని స్పష్టం చేసారు. ‘నా భార్య నన్ను మోసం చేస్తే,అది నా పూర్వ జన్మ పాపం. అందుకే ఇలా వేదనకు అన్యాయానికి గురయ్యాను. బాధితునిగా నిలబడ్డాను. నన్ను వదిలేయండి మహాప్రభో ‘అని పోలీస్ స్టేషన్ లో వేడుకున్నారు.
1979 మే2న అమెరికా వెళ్లి మొట్టమొదటి సారి విదేశీ గడ్డపై హరికథ చెప్పారు. ఎక్కడో తెనాలిలో వుండే వీరగంధం అమెరికా వెళ్లి హరికథ చెప్పారంటే అయన భాషా నైపుణ్యం,అంకితభావం ఎలాంటివో చెప్పక్కర్లేదు. న్యూయార్క్ ఆంధ్ర సభలకు రాజకీయ,సినీ ప్రముఖులతో పాటు వీరగంధం వెంకట సుబ్బారావుకి కూడా ఇన్విటేషన్ వచ్చింది. అయితే ఇది పంపింది స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు. టీవీల్లో ,రేడియోల్లో వీరగంధం హరికథలు విని ఆంధ్రాలో హరికథ చెప్పాలంటే వీరగంధం ఒక్కరే అని అక్కినేని అనేవారట. అందుకే ఆంధ్ర మహాసభలకు ఆహ్వానించారు.
పివి నరసింహారావు, అక్కినేని,జె బాపినీడు,డాక్టర్ దాసరి వంటి ప్రముఖులు వెళ్లారు. వీసా కారణంగా వారితో అమెరికా వెళ్లలేకపోయిన వీరగంధం వెనకాల విమానంలో వెళ్లారు. నాగార్జున స్వయంగా ఎయిర్ పోర్టుకి వచ్చి సభలకు తీసుకెళ్లారు. తిరిగి ఇండియా తిరిగొచ్చేవరకూ వీరగంధం ను అక్కినేని,నాగార్జున చక్కగా చూసుకున్నారు. అంతేకాదు ఆ రోజుల్లో పదివేల రూపాయలు చేతిలో పెట్టి ఇండియా పంపించారు.
ఇక అప్పటినుంచి 1985వరకూ ప్రతియేటా హరికథ చెప్పడానికి అమెరికా వెళ్లేవారు. చివరిగా లక్ష్మి పార్వతిని తీసుకెళ్లారు. అప్పుడే సుబ్బారావు గురించి ఎన్టీఆర్ కి తెల్సి సతీసమేతంగా ఆహ్వానించి, సన్మానించారు. ఇక అప్పటినుంచే ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తానంటూ లక్ష్మీ పార్వతి ఎంటర్ అవ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే.