Movies

ఈ నాటి హీరోలు సామాన్యులతో ఎలా కలుస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోతారు

ఈ మధ్య స్టార్ హీరోస్ తమదైన శైలిలో సేవాగుణం అలవర్చుకుని అమలు చేస్తున్నారు. ఎదుటి వారి కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. సాధారణ మనుషుల మాదిరిగా బతకడానికి ఇష్టపడుతూన్నారు. జనంతో మమేకం అవుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తాము సైతం అంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్,రామ్ చరణ్,మహేష్ బాబు ఇలా ప్రస్తుత స్టార్ హీరోస్ అందరూ తమతమ రేంజ్ లో సాధారణ జీవితానికి అనుగుణంగా మారుతున్నారు. కొందరి హీరోల భార్యలు కూడా సేవా గుణాన్ని చాటుకుంటున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇటీవల బన్నీ డ్రైవర్ కి స్పెషల్ బీమా చేయించింది. అంతేకాదు వాళ్ళ అవసరాలు తీర్చడం,వారి పిల్లల చదువుకి ఆర్ధిక సాయం అందించడం చేస్తోంది.

కాగా రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా సామాజిక సేవ అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఆమె చేసే సోషల్ యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన చుట్టూ ఉన్నవారికోసం ఏదోకటి చేయాలనీ తపిస్తూ ఆచరణలో పెడుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తనను నమ్ముకుని వచ్చినవారికి ఏదోరకంగా సాయం చేస్తుంటాడు. అతడి భార్య నమ్రత కూడా సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గానే ఉంటోంది. భర్త మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి సామాజిక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఇక హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన ఏ ఎంబి హాలులో అనాధ పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ షో వేయించింది.

మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరికైనా సాయం చేసినా, ఆదరించినా గమ్మున బయటకు వెల్లడి కానీయడు. ఎవరికీ తెలియకుండా ఉండేలా ఎన్నో కార్యక్రమాలు తారక్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అయింది. అదేమిటంటే తన ఇంట్లో పనిమనిషి పెళ్ళికి స్వయంగా హాజరై, వధూవరులను ఆశీర్వదించి, లక్ష రూపాయలు కానుకగా అందించాడని తెలుస్తోంది. ఇంటిలో ఎప్పుడు మాకోసమే పనిచేసే దానికి కృతజ్ఞత తప్ప,సాయం కాదని కూడా ఎన్టీఆర్ అన్నాడట. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో కలిసిపోవడం చూసి అక్కడి వారంతా ఉప్పొంగిపోయారట. తాతకు తగ్గ మనవడంటూ అందరూ మెచ్చుకున్నారట.

ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆ మధ్య తన డ్రైవర్ పెళ్ళికి వెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇలా ఈనాటి హీరోలు తమదైన శైలిలో సామాన్యులతో మమేకం అవుతుండడం శుభ పరిణామామే.