2018 లో ఈ హీరోలు కనపడకుండా ఉండటానికి కారణాలు ఏమిటో?
గతంలో ఓ సినిమా తీయాలంటే ఏడాది పట్టేది. సినిమా కూడా ఏడాది ఆడేది. కానీ రాను రాను ఏడాదికి ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు కూడా చేసి హిట్స్ కొట్టారు. ఒక్కొక్క హీరో అయితే ఏడాదికి డజను సినిమాలు కూడా చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించాలని అనుకుంటున్నా కుదరడం లేదు. ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తున్నారు. ఒక్కొక్క హీరో అయితే ఒక్క సినిమా కూడా ఏడాదికి రావడం లేదు. ఫాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అంతెందుకు 2018లో చాలామంది హీరోలు వెండితెరమీద మెరవలేదు. అలాంటి హీరోల్లో ప్రభాస్ ని ముందుగా ప్రస్తావించాలి.
ఒకప్పుడు వరుస సినిమాలు యాక్ట్ చేసిన ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లు సమయం వెచ్చించాడు. ఎంతో అంకితభావంతో బాహుబలి చేసిన ప్రభాస్ కి తదుపరి మూవీ ఏదీ రాలేదు. మరో భారీ బడ్జెట్ మూవీ సాహులో నటిస్తున్నాడు. అయితే అది కూడా ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని ఫాన్స్ ఓ నిర్ణయానికి వచ్చేసారు. 2018లో సాహు టీజర్ తో సరిపెట్టేసాడు. 2019చివరికి గానీ ఈ మూవీ వచ్చే పరిస్థితి లేదు.
అలాగే ప్రభాస్ తో పాటు బాహుబలిలో నటించిన రానా మూవీ కూడా 2018లో ఏదీ రాలేదు. నేనే రాజు నేనే మంత్రి మూవీ బాహుబలి తర్వాత వచ్చి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ఒకటి,రెండు దక్షిణాది సినిమాలు రానా చేతిలో ఉన్నాయి. 2018లో ఒక్క సినిమా లేకున్నా సుమంత్ నటించిన సుబ్రహ్మణ్య పురం మూవీకి వాయిస్ అందించాడు.
అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ 2018లో కనిపించలేదు. హలొ సినిమా కూడా హిట్ కొట్టలేదు. అందుకే తదుపరి చిత్రం విషయంలో గ్యాప్ తీసుకున్నాడు. ఇక మజ్ను మూవీ 2019లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చే ఈ మూవీ సక్సెస్ ఇస్తుందని అఖిల్ ఆశతో ఉన్నాడు.
ఇక ఫామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ గల వెంకటేష్ కి గురు మూవీ తర్వాత ఇప్పటిదాకా మరో చిత్రం రాలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఎఫ్ – 2 సినిమా ఒకే చేసాడు. నిజానికి ఇతని కోసం ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నా సరే,తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఐతే కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ ఈ ఏడాది రెండు సినిమాలకు ఒకే చెప్పాడు. 2019లోనే ఎఫ్ – 2 సంక్రాంతికి వస్తుంటే,ఆతర్వాత నాగచైతన్యతో వెంకీ మామా మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా సినిమా చేస్తాడట.