Devotional

కనుమ రోజు ఇంటి ఆడపడుచుకి చీర పెట్టె సంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా?

పండుగ వచ్చిందంటే అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. పెద,ధనిక అనే భేదం లేకుండా అత్తరింటికి పంపిన కూతుళ్లను ఇంటికి పిలుస్తారు. సంక్రాంతి పండుగ సమయానికి ప్రతీ రైతు చేతి నిండా డబ్బు తో ఇంటి నిండా ధాన్యంతో కళకళలాడుతూ ఉంటాడు.అలాంటి సమయంలోనే ఈ పండుగ వస్తుంది.కావున ఈ పండుగ ను ఘనంగా జరుపుకుంటారు.

పుట్టింటికి వచ్చిన ఆడపడుచు కనుము రోజు ఉదయాన్నే తలస్నానం చేసి అన్నం ఎక్కువగా వండి అంటే ఉత్తి అన్నం కాకుండా పులిహోర లేదా పొంగలి కింద తయారుచేసి పెద్ద పెద్ద ముద్దలుగా చేసి ఇంటి బయట లేదా ఉరి బయట లేదా పోలంగట్ల పైన లేదా చెరువు గట్ల పైన పెట్టి వస్తారు.వాటిని ప్రాణులు అంటే పక్షులు ముగాజీవాలు వచ్చి తింటాయి . అంటే పితృ దేవతలు పక్షి రూపంలో వచ్చి తిని వెల్లుతారని ఒక నమ్మకం. ఇలా చేసిన ఆడపడుచులు ఇంటికి వెళ్లి స్నానము చేస్తారు. ఆ అమ్మాయి యొక్క అన్నదమ్ములు తమ మంచి కోసం ఆలా చేసింది కాబట్టి కొత్త బట్టలను పెట్టి సంతోష పెడతారట. ఈ సంప్రదాయం తమిళనాడులో ఎక్కువగా ఉంది. ఇది చాలా ప్రాచీన సంప్రదాయం.