ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ కి ఓనర్ నటి రేణుక అని తెలుసా?
కొందరు నటిస్తుంటే మన ఇంట్లో వాళ్ళో,మన పక్కింటి వాళ్ళో గుర్తొస్తారు. అలాంటి నటన కనబరిచే వాళ్లలో నటి రేణుక ఒకరు. గుప్పెడు మనసు సీరియల్ లో రేణుక నటన అద్భుతం. ఇక ఈమె బ్యాక్ గ్రౌండ్ చాలా ఎక్కువే. మామూలు మనిషి కాదు ఈమె. సినిమాలు చేస్తూ, ఓ పెద్ద సంస్థకు ఎండీగా బాధ్యతలు సంక్రమంగా నిర్వహిస్తోంది. ఈ సీరియల్ లో గీతా , ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ చేసారు. హీరోయిన్ మాధవి నటించిన మాతృదేవోభవ సినిమాను పోలివుండే గుప్పెడు మనసు సీరియల్ కె బాలచందర్ డైరెక్షన్ లో మంచి పేరు సంపాదించుకుంది. బాలచందర్ తమిళ సీరియల్ ప్రేమి సీరియల్ తో రంగప్రవేశం చేసిన రేణుక పలు సీరియల్స్ , సినిమాల్లో నటించారు.
తమిళనాడులోని శ్రీరంగంలో 1983లో రేణుక పుట్టారు. ఆమె తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆర్ధిక పరిస్థితులు వెంటాడాయి. ఓ పక్క ఇద్దరు తమ్ముళ్లు,మరోపక్క ఆర్ధిక ఇబ్బందులు,కుటుంబ పోషణ కష్టం కావడంతో ఉద్యోగం కోసం చెన్నె షిఫ్ట్ అయ్యారు. జాబ్ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఓ డ్రామా కంపెనీలో పని దొరికింది. ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణుకకు టి రాజేందర్ డైరెక్షన్ లో వచ్చిన సంసారం సంగీతం అనే మూవీ రేణుకకు బ్రేక్ ఇచ్చింది. తెలుగు ,మళయాళం భాషల్లో 70కి పైగా సినిమాల్లో చేసిన ఈమె తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించింది.
ఇక హిందీ సినిమాల్లో కూడా 2009లో ఎంట్రీ ఇచ్చిన రేణుక ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రేమి,గుప్పెడు మనసు వంటి సీరియల్స్ లో
నటించారు. బుల్లితెర,వెండితెర రెండు కళ్లుగా భావించే రేణుక టీవీల్లో బాలచందర్ కి ఆస్థాన నటిగా మారింది. నటి గీతతో కల్సి కొన్నాళ్ళు సీరియల్స్ లో నటించింది. చెన్నైలో బిజినెస్ మాగ్నట్ అయిన కుమారన్ ని పెళ్లి చేసుకుని,దేశంలోనే అత్యుత్తమ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ అలోహా ఇండియా అనే సంస్థను నడిపిస్తోంది. ముగ్గురు విద్యార్థులతో మొదలైన ఈ సంస్థ 12ఏళ్లలో 5లక్షల మంది విద్యార్థులను తయారు చేసింది.