కమెడియన్స్ కొడుకులు సినీ రంగంలో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసా?
అన్ని రంగాల్లో వారసత్వం కనిపిస్తోంది. రాజకీయ రంగం మాదిరిగా సినీ రంగంలో కూడా హీరో, హీరోయిన్స్ కొడుకులు హీరోలుగా, కూతుళ్లు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కేరక్టర్ యాక్టర్ల కొడుకులు కూడా నిలదొక్కుకుంటున్నారు. అయితే కమెడియన్స్ కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి ట్రై చేస్తే ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణం ఏమిటో తెలీదు కానీ ఇలా చాలామందే వున్నారు. ఒకటి రెండు చిత్రాలు ప్రమోట్ చేసినా,నిలదొక్కుకోవాలంటే,టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కావాలి. కమెడియన్స్ లో ప్రధానంగా తెరమీద కనిపిస్తే చాలు అభిమానుల్లో నవ్వులు పూసేలా చేయగల బ్రహ్మానందం తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ సినిమాలు తీసినా సక్సెస్ కాలేదు.
ముప్పై ఏళ్లుగా తెలుగు తెరపై హాస్యం పండిస్తున్న బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్ హీరోగా పల్లకిలో పెళ్లికూతురు మూవీతో ఎంట్రీ ఇప్పించాడు. గౌతమ్ మొదటి సినిమా బిలో ఏవరేజ్ అయింది. అయితే ఆతర్వాత బసంతి,వారెవ్వా మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. పాపం బ్రహ్మి ఎంతగా కొడుక్కి లిఫ్ట్ ఇచ్చినా ఆడియన్స్ కరుణించలేదు. ఇక విలనిజం కానీ, కామెడీ కానీ పండించడంలో దిట్ట గా పేరొందిన కోట శ్రీనివాసరావు కొడుకు విషయం తీసుకుంటే అదో విషాద గాథ అని చెప్పాలి.
కోట కొడుకు వర్ధమాన నటుడిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హీరో జగపతి బాబు సినిమా సిద్ధం లో కోట ప్రసాద్ కీలక పాత్ర పోషించి, రామ్ గోపాల్ వర్మ గాయంతో విలన్ రోల్ వేసాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం ప్రసాద్ ని మింగేసి విషాదం మిగిల్చింది. గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ కూడా సినిమా అచ్చిరాలేదు. అలాగే ఏవీఎస్ కుమారుడు రాఘవేంద్ర ప్రదీప్ హీరోగా కాకుండా డైరెక్టర్ గా నిలదొక్కుకోవాలని చేసిన ప్రయత్నం కలిసిరాలేదు.
షార్ట్ ఫిలిమ్స్ 7టెన్స్ మినహాయిస్తే ఇక ఏమీ ఆడలేదు. కాగా బాబూ మోహన్ ఇద్దరు కుమారుల్లో ఒక కొడుకు పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా,రెండవ కుమారుడు ఉదయ బాబు ని హీరోగా పెట్టి శ్రీ మేడారం సమ్మక్క,సారక్క మహత్యం అనే మూవీ తీస్తే,అది అట్టర్ పాప్ అయింది. ఎన్నో చిత్రాల్లో హాస్యంతో నవ్వించిన నగేష్ తన కొడుకు ఆనంద్ బాబుని హీరోగా ఎంట్రీ ఇప్పించినా ఆ మూవీస్ విజయంతం అవ్వలేదు.
ఇక తాగుబోతు పాత్ర అంటే ఠక్కున గుర్తొచ్చే కమెడియన్ స్వర్గీయ ఎం ఎస్ నారాయణ తన కొడుకు విక్రమ్ ని హీరోగా పెట్టి కొడుకు అనే మూవీ తీస్తే అది కాస్తా డిజాస్టర్ అయింది. ఈ మూవీకి ఎం ఎస్ డైరెక్షన్ చేయడం,నటుడిగా విక్రమ్ కి మంచి మార్కులు రావడం జరిగాయి. అయితే సినిమా సక్సెస్ కాకపోవడంతో ఛాన్స్ లు రాలేదు. ఇక పేరు మార్చుకుని భజంత్రీలు మూవీ చేసినా లాభం లేకపోయింది.