Movies

F2 సినిమాలో నటించిన ఈ నటుణ్ని గుర్తు పట్టారా… ఈ నటుని కూతురు కూడా టాప్ సీరియల్ హీరోయిన్

ఆరోజుల్లో అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న అందాల నటుడు ప్రదీప్ అంటే చాలామందికి తెల్సిన నటుడే. సినిమాల్లో కొన్నింటిలోనే కనిపించినా,బుల్లితెర రంగాన్ని ఆదీనినుంచి ఏలిన నటుడు యితడు. ముద్దమందారం,నాలుగుస్తంభాలాట వంటి సినిమాల్లో అతడి నటన అందరినీ కట్టిపడేసింది. కేవలం నాలుగు సినిమాల్లోనే నటించినప్పటికీ,హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సపోర్టింగ్ యాక్టర్ గా , తండ్రి కేరక్టర్ లలో కూడా నటించాడు. ఇక బుల్లితెర తొలినాళ్లలో సీరియల్స్ లో నటించడమే కాదు,నిర్మించి,దర్శకత్వం కూడా వహించాడు. దూరదర్శన్ లో మొట్టమొదటి బుల్లితెర నటుడు కూడా ఇతడే.

పెళ్లిపందిరి, అనగనగా శోభా వంటి సీరియల్స్ లో హీరోగా నటించాడు. నిర్మాతగా, డైరెక్టర్ గా, నటుడిగా రాణించిన యితడు బుచ్చిబాబు, పెళ్లిచూపులు,చాణక్య,మట్టిమనిషి,ముద్దు బిడ్డ,మంచి మనసులు,ఏది నిజం,మమతల కోవెల వంటి సీరియల్స్ లో నటించడమే కాదు నిర్మించాడు కూడా. సపోర్టింగ్ పాత్రల్లో సినిమాల్లో నటించి అలరిసున్నాడు. 35ఏళ్లుగా బుల్లితెరపై అలరిస్తున్న ప్రదీప్ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ తాజాగా ఎఫ్ 2మూవీలో అందరినీ పలకరించాడు.

హీరోయిన్ తండ్రి పాత్రలో భార్య ఏం చెప్పినా ‘అంతేగా, అంతేగా’అనే ఒక్క డైలాగ్ తో సినిమా నడిపించి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. నటుడికి ఉండాల్సిన హావభావాలు గురించి చెప్పాల్సి వస్తే ఈ పాత్ర సరిపోతుంది. ఇక ఈటివి మొదట్లో సుమాంజలి అనే ప్రోగ్రాం తో యాంకరింగ్ స్టార్ట్ చేసి,యాంకరింగ్ కి అర్ధం చెప్పిన సరస్వతి ఇతడి భార్య. ఈటివి,మాటివి,జెమిని,ఇలా అన్ని చానల్స్ లో యాంకర్ గా చేసింది. శ్రీమతి భాగ్యశ్రీ,నారీ భేరీ,తీర్ధ యాత్ర,మా పుణ్యక్షేత్రాలు,తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు సరస్వతి.

ఈమె భర్త మాదిరిగానే పలు సినిమాల్లో సపోర్టింగ్ కేరక్టర్స్ లో నటించిన సరస్వతి మాత్రమే కాదు వీళ్ళ మొత్తం యాక్టింగ్ లో ఆరితేరిన వారే. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కూతురు నిహారిక తన పేరెంట్స్ మాదిరిగా టాలెంటెడ్ పర్సన్. నటిగా, సింగర్ గా, యాంకర్ గా పేరుతెచ్చుకుంది. కొడుకు నితీష్ తన తండ్రి తీసిన పలు సీరియల్స్ కి సంగీతం అందించాడు.

మూడేళ్ళ ప్రాయంలోనే వన్స్ మోర్ అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నిహారిక,ఆతర్వాత బుల్లితెరమీద బాంగ్ బాంగ్ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. శశిరేఖ పరిణయం అనే సీరియల్ లో లీడ్ రోల్ వేసి హీరోయిన్ గా బుల్లితెరమీద కనిపించి,ప్రశంసలు అందుకుంది.