వెంకీకి భార్య అంటే చాలా ఇష్టం – అందుకే అలా చేసాడట…. ఏమి చేసాడు
మొదటి చిత్రం కలియుగ పాండవుల సినిమా నుంచి విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ఎంత ఎదుగుతున్నప్పటికీ అదే స్థాయిలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటాడు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా తండ్రి పేరుని నిలబెడుతున్న వెంకీ చెన్నై లో పుట్టి,ఫారిన్ లో చదువుకున్నప్పటికీ పాశ్చత్య పోకడలు అబ్బలేదు. ఇక ఇతడికి చిత్తూరుకి చెందిన గన్నవరపు సుబ్బారెడ్డి కుమార్తె నీరజతో పెళ్లయింది. వీరికి ముగ్గురు అడ పిల్లలు. ఒక కొడుకు.
సినిమా లైఫ్ వేరు,కుటుంబ జీవితం వేరు అన్నట్లుగా ఉంటాడు. షూటింగ్ ముగిస్తే నేరుగా ఇంటిబాట పడతాడు. ఇక తన కుటుంబాన్ని ఎక్కడా బయట కనపించనివ్వకుండా,కేవలం కుటుంబ ఫంక్షన్స్ కి మాత్రమే తీసుకెళ్తూ గాసిప్స్ లాంటి వారికి అసలు చోటివ్వకుండా క్లిన్ చిట్ గా ఉండడానికి ఇష్టపడతాడు. ఇక భార్య అంటే ఎంతోఇష్టమని వెంకీ తాజాగా సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2సినిమా సందర్బంగా వెల్లడించాడు. అందుకే వీలున్నంత మేరకు భార్య నీరజతో గడపడం చేస్తాడు.
ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నా భార్య నీరజ కారణం. ఆమె నా పక్కనుంటే విజయం తధ్యం’అని వెంకీ ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకొచ్చాడు. వెంకీ ఇలా చెప్పడంతో ఫాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ఇక రోజువారీ సమయం ఎలా గడిచిందో మాట్లాడుకోవడం, ఎంత ఆలస్యం అయినా సరే,కల్సి భోజనం చేయడం వెంకీ, నీరజల దినచర్య లో భాగంగా మారింది. ఇక భార్య పిల్లలతో కల్సి రెస్టారెంట్ కి వెళ్లి తినడమంటే ఎంతోఇష్టమని వెంకీ ఒక ఇంటర్యూలో చెప్పాడు. అందుకే ఇండస్ట్రీలో ఆదర్శ జంటగా వెంకీ,నీరజ ల గురించి చెప్పుకోవచ్చని అంటున్నారు నెటిజన్లు.