Movies

బాలయ్యకు సింహ పదానికి గల సంబంధమే కొంప ముంచిందా? సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదా?

సినిమాల వాళ్లకి సెంటిమెంట్ బలంగానే ఉంటుందని అందరూ అనేమాట. ఇక నందమూరి బాలయ్యకు అయితే చెప్పక్కర్లేదు. అందుకే సింహ శబ్దంతో ఆయన సినిమాలు అదరగొడతాయని చెబుతారు. లక్ష్మి నరసింహస్వామి అంటే ఎంతో భక్తిగల బాలయ్య సింహ శబ్దానికి మంచి విలువ ఇస్తారు. అయితే తాజాగా తన నిర్మాణంలో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా ప్రారంభంలో సింహం గాండ్రిచాక,నరసింహ స్వామి ప్రత్యేక్షం అవుతాడు. ఈ సినిమా చూసిన వారందరికీ ఇది తెల్సిందే. అయితే సెంటిమెంట్ పాటించినా కథానాయకుడు ఎందుకు డిజాస్టర్ అయింది. ఇలాగైతే తర్వాత వచ్చే మహానాయకుడి పరిస్థితి ఏమిటి అని డైలామాలో పడ్డారు. మరి సెంటిమెంట్ ఎందుకు వర్కవుట్ కాలేదబ్బా అని సినీ పండితులు లెక్కలేస్తున్నారు.

బాలయ్య లక్ష్మీనరసింహ స్వామి భక్తుడు కావడం ఆయన సినిమాలు కూడా అదే శబ్దం సెంటిమెంట్ తో ఆడడం యాదృచ్ఛికమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అహోబిలం లో నరసింహ స్వామి ఉద్భవం జరిగిందని అంటారు. ఇక సింహాద్రి అప్పన్న , మంగళగిరి పానకాల స్వామి,కదిరి నరసింహుడు, అహోబలేశ్వరుడు,తెలంగాణలో యాదాద్రి,ధర్మగిరి క్షేత్రాలున్నాయి. అందుకే యాదాద్రిని తిరుమలకు ధీటుగా తీర్చిదిద్దడానికి తెలంగాణా సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి కూడా చేస్తున్నారు.

బాలయ్య నటించిన సమరసింహారెడ్డి,నరసింహనాయకుడు బంపర్ హిట్ కొట్టాయి. ఇవి కూడా సింహ శబ్దంతో కూడినవే. ఇక ఆతర్వాత లక్ష్మీనరసింహ కూడా సింహా సౌండ్ ఉన్నదే. అయితే ఆతర్వాత వరుసగా బాలయ్య సినిమాలు ప్లాప్ అవుతున్న నేపథ్యంలో వచ్చిన సింహా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.ఇలా రెండు మూడు సినిమాలు సింహా శబ్దంతో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ నరసింహస్వామికి బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలయ్య ఎంతో కష్టపడి తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు నష్టాలు తెచ్చిపెడుతోందని
balakrishna, bramhanandam, mega family, nandamuri family, tollywood,Movies
ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్ల రూపాయల మేరకు నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రభావం ఎన్టీఆర్ మహానాయకుడు మూవీపై పడేలా ఉంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ పిలిచి మహానాయకుడు ఆపాలని చంద్రబాబు చెప్పేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. రాజకీయ జీవితం అంటే ఎంతలేదన్నా చంద్రబాబుపై నెగెటివ్ షేడ్ కనిపిస్తుందని అందుకే ఆపాలని హుకుం జారీ అయినట్లు టాక్ నడుస్తోంది.

పైగా రామ్ గోపాలవర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందన్న వార్తలు వస్తున్నాయి దీనికి అసలు కారణం బాలయ్య జాతకంలో రివర్స్ కొడుతోంది. మూల నక్షత్రం ప్రకారం ఆయనకు ఏలిననాటి శని నడుస్తోందని,ఎంత బ్లాక్ బస్టర్ మూవీ తీసిన దెబ్బ తప్పదని అంటున్నారు.