ప్రస్తుతం టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తున్న ఈ స్టార్ హీరో ని గుర్తు పట్టారా?
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడెలా మారిపోతాయో తెలీదు. ఇక స్టార్ స్టేటస్ కూడా ఒక్కసారిగా వచ్చిపడిపోతుంది. సరిగ్గా విజయ్ దేవరకొండ విషయంలో తీసుకుంటే,పట్టుమని పదిసినిమాలు కూడా చేయకుండానే స్టార్ హీరో అయ్యాడు. వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసే స్థాయికి వచ్చేసాడు. రెండు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి,జయ హో అంటూ దూసుకెళ్తున్నాడు. మరోపక్క యాడ్స్ లో కూడా నటిస్తూ బ్రాండ్ అంబాసిడర్ ఛాన్స్ కూడా కొట్టేసాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ధోరణిలో నడుచుకుంటున్నాడు.
తన డ్రెస్ ,మాట్లాడే విధానానికి మంచి క్రేజ్ యూత్ లో సొంతం చేసుకున్నాడు. ఓపక్క ఫాన్స్ కి నచ్చే మూవీలతో మినిమమ్ గ్యారంటీ గల హీరోగా తయారయ్యాడు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా పెద్ద హీరోలతో పోటీపడి అందుకుంటున్నాడు. మరోపక్క కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేసి,సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టేసాడు. పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్క్రీన్ పై కనిపించలేదు.
నిజానికి చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సత్తా చాటాడు. పుట్టపర్తి లో స్టడీస్ సమయంలో షావుకారు జానకి మెయిన్ రోల్ తో చేసిన షోలో పిల్లల విభాగంలో నటించాడు. పుట్టపర్తి సత్యసాయిని ప్రమోట్ చేస్తూ తీసిన ఈ షోలో విజయ్ ని చూసిన ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ఎంత క్యూట్ గా వున్నాడో అంటూ చిన్నప్పటి ఫొటోస్,వీడియస్ పెట్టడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.