Movies

దిల్ రాజు తీసిన సినిమాల్లో ఎన్ని సినిమాలు దిల్ రాజుకి నచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆవిర్భావం నుంచీ ఎందరో నిర్మాతలు వస్తున్నారు,పోతున్నారు. కానీ అందులో ఎవర్ గ్రీన్ సినిమాలతో మిగిలేది కొందరే. ఇక ప్రస్తుత కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో విలువల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా క‌ల‌గ‌లిపి సినిమాలు నిర్మించ‌డంలో దిల్ రాజు స్పెషాల్టీ వేరు. ఈయ‌న సినిమాలు చాలావరకూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాయి. అందుకే ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘ఎఫ్2’ సినిమా విజ‌యం సాధించ‌డంతో త‌న ఆనందా నికి అవధుల్లేవ్. తన అనుభూతిని ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ, ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్‌లో 31 సినిమాలను నిర్మించానని చెప్పుకొచ్చాడు.

ఇక అందులో చాలా వ‌ర‌కు విజ‌యాలు నమోదు చేసుకుంటే,కొన్ని న‌ష్టాలు తీసుకొచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అలా డిజాస్టర్ అయిన మూవీస్ చాలా తక్కువే అని చెప్పాలి. అయితే ఇన్ని సినిమాల్లో దిల్ రాజుకు న‌చ్చిన సినిమాలు మాత్రం చాలా త‌క్కువ‌ని చెప్పాలి. ఏ నిర్మాత అయినా తాను చేసిన సినిమాల‌న్నీ ఇష్ట‌మే అని చెప్తాడు.. కానీ దిల్ రాజు మాత్రం 31 సినిమాల్లో కేవ‌లం 7 సినిమాలు మాత్ర‌మే న‌చ్చాయని చాలా ధైర్యంగా చెప్పేస్తున్నాడు.

నిజానికి త‌మ సినిమాలు న‌చ్చ‌లేదా అంటూ మిగిలిన వాళ్లు కూడా ఫీల్ అవుతుంటారు క‌దా.. కానీ అలా అనుకోకుండా ఆ సినిమాల పేర్లు దిల్ రాజు వరుస పెట్టి చెప్పాడు ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, మిస్టర్ పెర్ఫెక్ట్, బృందావనం, ‘శతమానం భవతి , ‘ఎఫ్ 2’ మూవీస్ తాను తీసిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన మూవీస్ అని చెప్పాడు. ఇవే త‌న‌కు నిర్మాత‌గా ఎక్కువ సంతృప్తి ఇచ్చిన సినిమాలు అంటున్నాడు. అయితే ఇందులో అగ్ర స్థానం బొమ్మ‌రిల్లుకే దక్కుతుందని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. మరి మిగిలిన సినిమాల హీరోలకు కోపం రాదు కదా.