ఈ హీరోయిన్ తండ్రి క్రికెటర్ …. భర్త పెద్ద నిర్మాత… మరిది స్టార్ హీరో ఎవరో చూడండి
తమ నటనతో ఆకట్టుకోవడంలో తమిళ స్టార్స్ ని మించిన వాళ్ళని లేరని నానుడి. అయితే అలాంటి నటనతో కట్టిపడేస్తూ తక్కువ సినిమాలే యాక్ట్ చేసినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రేయారెడ్డి స్కూల్ డేస్ లోనే మోడలింగ్ చేసి ఆకట్టుకుంది. అయితే చదువుకు ఆటంకం కలగకూడదని దూరంగానే ఉంది. అయితే వయస్సు పెరగడంతో పాటు ఆమెకు నటన మీద కాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో డిగ్రీ చదివే రోజుల్లో సౌత్ ఇండియా మ్యూజిక్ ఛానల్ ఎస్ ఎస్ మ్యూజిక్ చానల్ లో చాలామంది ఆడిషన్స్ కి వెళ్తే ఈమె కూడా వెళ్లి అందరిలో నెంబర్ వన్ గా నిల్చి వీజేగా ఛాన్స్ దక్కించుకుంది.
ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకున్నా వీజేగా బుల్లితెర రంగాన్ని ఓ ఊపు ఊపేసిన శ్రేయారెడ్డి యాంకర్ గా టిఆర్పి రేటింగ్స్ ని టాప్ లెవెల్లోకి తీసుకెళ్లింది. స్టార్ హీరోయిన్ మాదిరిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇక సినీ రంగానికి సంబంధించి తెలుగులోనే ఎంట్రీ ఇచ్చినా,నటిగా వెండితెరమీద వెలిగిపోయిన తొలి మూవీ మాత్రం తమిళ సినిమా కావడం విశేషం. తెలుగులో రాజా మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
అయితే ఆమూవీ ఆడకపోవడం వలన తెలుగులో పెద్దగా ఛాన్స్ లు రాలేదు. కాకపొతే తమిళ,మళయాళ భాషల్లో వరుస ఛాన్స్ లతో ముందుకు దూసుకెళ్లింది. తమిళంలో కాంచీవరం,మళయాళంలో భరత్ చరణ్ ఐపీఎస్ వంటి సినిమాల్లో శ్రేయారెడ్డి నటనకు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. తెలుగులో పందెం కోడి పేరుతొ డబ్బింగ్ అయిన విశాల్ తమిళ సినిమా తమిరై మూవీలో పూర్తి నెగెటివ్ షేడ్ పాత్రలో శ్రీయారెడ్డి చేసిన నటనకు అందరూ ఏమిటి ఈ నటన అంటూ అందరూ నోరెళ్లబెట్టారు.
ఎలాగైనా హీరోని పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో మొండి ఘటంగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆతర్వాత గుణ్ణం గంగరాజు నిర్మించిన అమ్మ చెప్పింది మూవీతో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది. 1973లో ఇండియన్ టీమ్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురే శ్రీయారెడ్డి. ఇక ఈమె ప్రేమించి పెళ్లాడిన ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణ స్వయానా విశాల్ కి అన్నయ్య కావడం విశేషం. ఇలా రీల్ లైఫ్ లో మరిదిని లవ్ చేసి, రియల్ లైఫ్ లో అతడి అన్నను పెళ్లాడిందన్నమాట.