శ్రీ వికారి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?
శ్రీ వికారి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 03 అవమానం – 01. వృశ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా చాలా చక్కని ఫలితాలు కలుగచేయును. ఆర్ధిక పరిస్థితి సంవత్సరం మొత్తం బాగుంటుంది. విద్యార్ధులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ,వంశంలో పేరు ప్రఖ్యాతలను ఏర్పరచును. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. వృచ్చికరాశి వారికి ఈ సంవత్సరం 23-జనవరి-2020 నుండి ఏలినాటి శని దశ పుర్తిఅగును. గత ఆరు సంవత్సరాల నుండి ఉన్న శని దోష ప్రభావం తొలగిపోవును.
ఈ సంవత్సరం కుటుంబ , ఆర్ధిక లావాదేవీలు , వ్యాపార వ్యవహరాదులు లాభదాయకంగా కొనసాగును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆటంకములు ఎదుర్కొనును. అవసరానికి బంధువుల సహాయం అందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. వృశ్చిక రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం 22-జనవరి-2020 వరకూ మంచి ఫలితాలను ఇవ్వడు. సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు ,అధిక ధన వ్యయం, అనారోగ్య సమస్యలను ఏర్పరచును. 23-జనవరి -2020 తదుపరి ఏలినాటి శని దశ పుర్తిఅగును. లాభం,నష్టం రెండు సమానంగా ఉంటుంది. రాహు – కేతు గ్రహముల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. రాహువు ఆరోగ్య కష్టములను, కేతువు అధిక ధనవ్యయం ఏర్పరచును. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కోను వారు రాహు గ్రహ శాంతి జరిపించుకోనువలెను.