Movies

లక్ష్మీ కళ్యాణం సీరియల్ హీరోయిన్ హర్షిత గురించి నమ్మలేని నిజాలు

గతంలో సినిమాల్లో హీరో హీరోయిన్స్ కి మాత్రమే క్రేజ్ ఉండేది. రాను రాను అన్ని విభాగాల వారికి కూడా గుర్తింపు రావడం మొదలైంది. ఇక బుల్లితెర మీద నటించేవాళ్లకు ప్రస్తుతం మంచి గుర్తింపు వేగంగా వచ్చేస్తోంది. ముఖ్యంగా సీరియల్స్ ప్రభావం అంతలా జనం మీద ఉందని చెప్పాలి. అందులో హర్షిత కు మంచి గుర్తింపు వచ్చింది. గత మూడేళ్ళుగా నడుస్తున్న లక్ష్మి కళ్యాణం సీరియల్ లో హీరోయిన్ గా చేసున్న ఈమెకు తెలుగునాట ఉన్న గుర్తింపు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఫాన్స్ వీరలెవెల్లో ఉన్నారు.

నటన పరంగా ఎలాంటి అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన హర్షిత పూర్తి పేరు హర్షిత వెంకటేష్. ఈమె కర్ణాటకలోని ఓ గ్రామంలో పుట్టింది. ఐదేళ్ల నుంచి బెంగుళూరులో పెరిగింది. ఈమె తండ్రి ఓ ప్రయివేట్ సంస్థలో సాధారణ ఉద్యోగి,తల్లి గృహిణి. మ్యూజిక్,డాన్స్ , స్టేజ్ పెర్ఫార్మెన్స్ లపై ఎంతోమక్కువగల హర్షిత స్టడీలో కూడా నెంబర్ వన్ గా నిలిచేది. మా టివిలో వచ్చిన అష్టా చెమ్మా సీరియల్ లో లీడ్ రోల్ స్వప్న కేరక్టర్ కి ఎంపికైన ఈమె రెండు మూడు నెలలు షూటింగ్ అయ్యాక ఎంబీఏ చదువు కారణంగా మధ్యలోనే తప్పుకుని వెళ్ళిపోయింది.

కన్నడంలో సీరియల్స్,స్టేజ్ షోలు చేసిన హర్షిత అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా చేసి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో కథ బాగుండడంతో అందివచ్చిన ఛాన్స్ వదులుకోకూడదని లక్ష్మీ కళ్యాణం అఫర్ ని ఒప్పేసుకుంది. లక్మి కళ్యాణం సీరియల్ తో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న హర్షిత కు పెద్ద పెద్ద పెళ్లి సంబంధాలు కూడా వచ్చేస్తున్నాయి. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇక స్క్రిప్ట్ బాగా రాసి ఎప్పటికైనా మంచి డైరెక్టర్ కావాలని కూడా ఆశిస్తోంది.