Chala Bagundi: ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?
Chala Bagundi Heroine:స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన హీరోయిన్ మాళవిక తమిళంలో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో శ్రీకాంత్ , వడ్డే నవీన్ హీరోలుగా నటించిన మూవీ’చాలా బాగుంది’తో ఎంట్రీ ఇచ్చిన మాళవిక తెలుగులో అరడజను మూవీస్ మాత్రమే చేసింది. అయితే మాత్రం గ్లామర్ గాళ్ గా మంచి పేరు తెచ్చుకుంది. కన్నడంలో ఒక సినిమా మాత్రమే చేసిన ఈమె తమిళంలో పాతిక చిత్రాలు చేసింది.
తెలుగులో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మూవీ ఆమెకు ఆఖరి సినిమా. అందులో రాజేంద్రప్రసాద్ హీరో గా వేసాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ తో వచ్చిన మనస్పర్థలు కారణంగానే ఈ భామ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందట. ఈ విషయం అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అయితే ఆతర్వాత 2009వరకూ తమిళంలో కొనసాగింది. ఇక ఛాన్స్ లు లేకపోవడంతో ఇక ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించకుండా పోయింది.
సురేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్ళాడి సెటిల్ అయింది. తాజాగా ఓ ప్రయివేట్ పార్టీకి వచ్చిన మాళవిక ను గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టిందట.
మాళవిక ముఖారవిందం కూడా మారిపోయింది. అయితే సడన్ గా చూసిన వాళ్ళు షేక్ అయ్యారు. మరి ఎందుకు ఇలా మారిపోయి దర్శనం ఇచ్చిందో తెలియదు కానీ, ఆమె ఫాన్స్ మాత్రం బాధ పడిపోతున్నారు.
నిజానికి మాళవిక ముంబయిలో నివసిస్తోంది. ఆమె భర్త ముంబయిలో ఆర్కిటెక్టర్ ఇంటీరియర్ డిజైనర్. సురేష్ మీనన్ ఓ కంపెనీ నెలకొల్పి ఇండియాలోనే బెస్ట్ డిజైనర్ గా రాణిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సినిమాకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటోంది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u