యాత్రలో చిన్నప్పటి వైఎస్ గా వేసిందెవరో తెలుసా? ఎవరి కొడుకో తెలుసా?
ఇది బయోపిక్ ల సీజన్. మహానటి,ఎన్టీఆర్ కథానాయకుడు చూసాం. ఇక తాజాగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో అంశాలు, ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకుని డాక్టర్ వైఎస్ మాటకు ఎలా కట్టుబడి వుంటారో చూపిస్తూ తీసిన యాత్ర మూవీ బాగానే క్లిక్ అయింది. మహీ వి రాఘవ్ కేవలం డాక్టర్ వైఎస్ చేసిన పాదయాత్రను ప్రధాన అంశంగా తీసుకుని బయోపిక్ రూపొందించి మంచి సాహసం చేసాడు.
ఇక డాక్టర్ వైఎస్ పాత్రలో ముమ్ముట్టి ఒదిగిపోయాడు. అచ్చం వైస్సార్ లాగే ఉన్నాడే అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే పాదయాత్ర తర్వాత డాక్టర్ వైఎస్ సీఎంగా ప్రమాణం చేయడం,పధకాలు ప్రారంభిస్తూ మాట్లాడ్డం కూడా ఒరిజనల్ బిట్స్ పెట్టడం కొత్త అనుభూతిని ఇచ్చిందని అంటున్నారు. రాజారెడ్డిగా జగపతి బాబు కెవిపి గా రావు రమేష్, ఇంకా వైఎస్ విజయమ్మ,వైఎస్ అనుచరుడు సూరి,వి హనుమంతరావు,ఇలా అన్ని పాత్రలు కూడా బాగా మెప్పించాయి.
అయితే వైఎస్ చిన్నప్పుడు సీన్స్ కూడా చూపించారు. చిన్నప్పటి వైస్ గా నటించిన కుర్రాడు సినిమా కుటుంబంతో సంబంధం ఉన్నవాడు కాదు. వైఎస్ జగన్ సన్నిహిత మిత్రుని కొడుకని వినిపించింది.
అయితే ఆ వార్తల్లో నిజం ఉంది. జగన్ కి అత్యంత సన్నిహితుడైన మంగలి కృష్ణ అనే దంతులూరి కృష్ణ కుమారుడే ఈ కుర్రాడు. వైఎస్ కుటుంబమే కాదు,సన్నిహితులు కూడా కనిపించని బంధాన్ని ఈ సినిమాతో మరింతగా ఏర్పరచుకున్నారు.