Devotional

ఆంజనేయ స్వామి దండకం దిండు కింద పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

చాలామంది ఆంజనేయ స్వామి పుస్తకాన్ని పారాయణం చేసి దిండు కింద పెట్టుకుంటారు. అలా పెట్టడం అపచారమట. ఇక దేవుడి ఫొటోలను, దేవుడి బిళ్లలను తలకింద పెట్టుకుంటారు. ఎందుకంటే నిద్రలేవగానే కళ్లకు అద్దుకునేందుకు ఇలా చేస్తుంటారు. అది కూడా దోషభూయిష్టమేనట. మంచం ఎప్పటికీ యోగ స్థానం తప్ప ఐశ్వర్య స్థానం కాదు. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఐశ్వర్యం ఇంట్లో ఎల్లవేళలా నిండుగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పసుపూ కుంకుమ:
పసుపూ కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. మంచానికి భోగ స్థానం అని పేరు. అందుకే ఎప్పుడూ పసుపూ కుంకుమ, ఇతర పూజా ద్రవ్యాల్ని మంచంపై పెట్టకూడదు. తమలపాకులు, పూలు, పళ్లు, అవి పెట్టిన కవర్లు తీసుకొచ్చి మంచం మీద పెట్టకూడదు. దేవతలకు నైవేద్యం పెట్టడం కోసం తెచ్చుకున్న పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదట