లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతి పాత్ర పోషించిన నటి ఎవరో తెలుసా?
ఇది బయోపిక్ ల కాలం. ఇప్పటికే మహానటి పేరిట సావిత్రి జీవిత కథ సినిమాగా వచ్చి సెన్షేషనల్ హిట్ అయింది. ఇక బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. అయితే అనుకున్నంత గా ఈ సినిమా ఆడలేదు. ఇక రెండవ భాగం మహానాయకుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే అదేసమయంలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రాబోతుంది. ఈ సినిమా ద్వారా ఇప్పుడు మరో వివాదానికి తెరలేపుతూ, ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ జీవితంలో కొత్త కోణం చూపించబోతున్నానని ప్రకటించి కొందరి కి టార్గెట్ అయ్యాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ తీసే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబుకి సంబంధించి ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఊహిస్తున్నట్టుగానే ట్రైలర్ లో డైలాగులు కూడా ఉండడంతో అందరూ షాక్ తింటున్నారు. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితం ఎలా ఉంటుందో టీజర్ తో వర్మ శాంపిల్ చూపించాడు. ఇక సినిమాలో ఒరిజనల్ గెటప్ లకు వారి పాత్రలకు తగ్గ ఫేస్ లను వర్మ ఎన్నుకుంటాడు. అచ్చు గుద్దినట్లు ఫేస్ లు సరిపోతాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి చాలావరకూ దగ్గరగా ఉండే ఫేస్ లను ఎన్నుకున్నాడు. ఎన్టీఆర్ ,చంద్రబాబు,లక్ష్మి పార్వతి ఇలా అన్ని పాత్రలు చూస్తే ఒరిజనాల్టికి దగ్గరగా ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈమూవీ ఆడియన్స్ ముందుకి రాబోతోంది.ముఖ్యంగా లక్ష్మీపార్వతి పాత్రకోసం తీసుకున్న నటి కూడా చాలావరకూ సెట్ అయిందని చెప్పాలి. ఈ పాత్రను కొన్ని రోజులక్రితం వర్మ విడుదల చేసాడు. అయితే వీపు మాత్రమే చూపిస్తూ ఎవరీ నటి అనుకునేలా చర్చకు దారితీసేలా చేసాడు.
ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ లోని అంశాలు పరిశీలిస్తే దిమ్మ తిరుగుతుంది. లక్ష్మీపార్వతి గెటప్ లో గల నటిని చూసి అందరూ షాక్ తిన్నారు. ఆ నటి ఎవరంటూ సెర్చ్ చేయడంతో అయితే ఆమె పేరు యజ్ఞా శెట్టి. వర్మ డైరెక్షన్ లో లోగడ వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ లో వీరప్పన్ భార్యగా నటించింది. దీంతో లక్ష్మీపార్వతి గెటప్ కోసం ఈమెను తీసుకున్నాడు వర్మ.
2007లో సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈమె కన్నడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈమె ఓండు ప్రితియా అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఉమేష్ శెట్టి, జయంతి దంపతులకు జన్మించింది. యజ్ఞా శెట్టికి మహాలక్ష్మి,గాయత్రీ,అశ్విని అనే ముగ్గురు తోబుట్టువులున్నారు. ఈమె చదువులో టాప్ గా నిలుస్తూ ఎంబి ఏ లో ఫైనాన్స్ చేసింది. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పాటు ఈ ఏడాది ఆపరేషన్ నక్షత్ర , లవ్ జంక్షన్,కళత్తూర్ గ్రామం,పల్లవి టాకీస్ చిత్రాల్లో నటిస్తోంది.