Pay Tm,Google Pay,Phone pe వీటిలో ఏది బెస్ట్ తెలుసా?
పూర్వం నగదు లావాదేవీలు చేయాలంటే,బ్యాంకు,ఏటీఎం లు మాత్రమే. ఇక చెక్కులు, డిడిలు సరేసరి. కానీ ప్రధాని మోడీ నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరగడంతో కొత్తగా థర్డ్ పార్టీ సంస్థలు వచ్చాయి. అందులో Pay Tm,Google Pay,Phone pe, bhim app వంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఇందులో Pay Tm మొదట్లో లీడ్ తీసుకుంటే ఆతర్వాత మిగిలిన సంస్థలు రంగప్రవేశం చేసాయి. కేంద్ర ప్రభుత్వం భీం,యుపిఐ వంటి వాటికి నాంది పలికింది. ఇందులో భీం యాప్ జనం నోట్లో బానే నానినప్పటికీ ఆతర్వాత చతికిలబడింది.
ఇక పేటీఎం రెగ్యులర్ గా వాడడం జనాలకు రివాజయింది. గూగుల్ పే, ఫోన్ పే లు మాత్రం క్యాష్ బ్యాక్ లు,రివార్డ్స్,స్క్రాచ్ కార్డులు, ఆఫర్స్ ఇస్తుండడంతో వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. పైగా కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ లో ఉండే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) ద్వారా ఈ సంస్థలు కొనసాగుతున్నందున జనం వీటిని బానే వాడుతున్నారు.
ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు కి డబ్బుని పంపడానికి సులువుగా వీటిని వాడేస్తున్నారు. కాబ్ సేవల కోసం నెలకు 20లక్షల మంది వీటిని వినియోగించి డబ్బులు చెల్లిస్తుండడం విశేషం. ఇప్పటికే 22.1 కోట్ల లావాదేవీలను నిర్వహించి పేటీఎం నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే 22కోట్ల లావాదేవీలు నిర్వహించడం ద్వారా గూగుల్ పే, ఫోన్ పే కూడా పోటాపోటీగానే ఉండడం విశేషం.
అయితే 22కోట్ల లావాదేవీలు ఎప్పుడో చేశామని, వీటివిలువ 30వేల కోట్ల రూపాయలుంటుందని ఫోన్ పే చెబుతోంది. అయితే వీటి దెబ్బకు భీం సేవలు మాత్రం ముందుకు సాగడం మానేశాయి. కేవలం 1. 4కోట్ల లావాదేవీలు మించి జరగడం లేదు.
సగటు లావాదేవీలు , టికెట్ సైజ్ ఏవరేజ్ న బీమ్ లో 4436లావాదేవీలు ఉన్నాయి. గూగుల్ పే 1200, పేటీఎం 1907,ఫోన్ పే 1300 లో తక్కువగా వున్నాయి. మొత్తం మీద థర్డ్ పార్టీల సంస్థల్లో పేటీఎం అగ్రగామిగా ఉంది.