హీరోయిన్లను మించిపోతున్న తెలుగు యాంకర్ల రెమ్యునరేషన్స్
బుల్లితెర మీద పలు చానల్స్ , ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ చానల్స్ రావడంతో యాంకర్స్ వ్యవస్థ ఒక్కసారిగా ఊపందుకుంది. అంతకుముందు దూరదర్శన్ లో ఒకరిద్దరు యాంకర్స్ ఉంటె, ఆతర్వాత వచ్చిన ఛానల్స్, వాటి ప్రోగ్రామ్స్ అన్నీ యాంకర్స్ నడిపిస్తున్నారు. బయట వాళ్లకు క్రేజ్ కూడా అలానే ఉంది. ఇక వాళ్ల రెమ్యునరేషన్ కూడా హై రేంజ్ లో ఉంది. వాళ్ళు నెలకు సంపాదించే లెక్క తెలిస్తే కొందరు గుండె గుభేల్ మంటుంది. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోయిన్ల కంటే కూడా మన దగ్గర గల కొందరు స్టార్ యాంకర్ల సంపాదన ఎక్కువని చెప్పొచ్చు.
కొందరు నెలనెలా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలకు లక్షలు నింపేసుకుంటున్నారు. మరి వాళ్ల కష్టం కూడా అలాంటిదే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెం 1 యాంకర్ ఎవరు అంటే ఠక్కున సుమ కనకాల పేరు చెప్పి తీరాలి. నిజానికి మలయాళీ అయినా కూడా తెలుగమ్మాయిల కంటే తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. ఇదే ఆమెకు శ్రీరామరక్ష. పైగా ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది సుమ కనకాల.
ఈమె ఇప్పటికీ ప్రతీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ తో పాటు ఆడియో వేడుకలకు కూడా, ఇతర సినీ వేడుకలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఒక్కో ఆడియో ఫంక్షన్ కు దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు సుమ వసూలు చేస్తుందని అంటున్నారు. అవార్డు ఫంక్షన్ అయితే రేట్ మరోలా ఉంటుందని అంటున్నారు.
ఇక ఆతర్వాత చూస్తే, గ్లామర్ షోతో మతులు పోగొట్టే రంగమ్మత్త అనసూయకు కూడా ఇదే రేంజ్ డిమాండ్ పలుకుతోంది. ఈమె ఒక్కో ఈవెంట్ కు దాదాపు 2 లక్షలు ఛార్జ్ చేస్తుందనే టాక్ నడుస్తోంది. అయితే ఈ మధ్య ఈవెంట్స్ చేయడం మానేసిన అనసూయ.. టీవీ షోలతోనే బిజీగా ఉంది. అలాగే మరో జబర్దస్థ్ పోరీ రష్మి గౌతమ్ కు కూడా క్రేజ్ బానే ఉంది. ఈవెంట్స్ కు తోడు ఓపెనింగ్స్ తోనూ సందడి చేసే ఈ భామ రెమ్యునరేషన్ దాదాపు లక్షన్నరపైనే ఉంటుందట.
సినిమాల్లో క్రేజ్ పెరిగిన తర్వాత రష్మి రేట్ కూడా డబుల్ చేసేసిందట. కాగా రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్ కు 50 వేల వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో చెప్పే మాట. ఇక ఇప్పుడు సోనియా చౌదరి హవా కూడా బాగానే నడుస్తుంది. పెళ్ళి అయిన పిల్లాడు పుట్టిన తర్వాత కూడా వరసగా చిన్నా పెద్ద సినిమాల ఆడియో ఈవెంట్స్ లో బాగానే ఈమె దూకుడు పెంచేసింది.
ఆ మధ్య ‘హుషారు’ ఆడియో వేడుకలో సోనియా చౌదరి అదరకొట్టేసింది. ఈమె కూడా ఒక్కో ఈవెంట్కు దాదాపు 20 నుంచి 30 వేల వరకు వసూలు చేస్తుంది. ఇక శ్రీముఖి.. శ్యామల.. ప్రశాంతి లాంటి యాంకర్లు కూడా ఇప్పుడు తెలుగులో తమ రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ఒకవిధంగా రష్మి, అనసూయ ఆడియో వేడుకలకు దూరంగా ఉండడం వలన మిగిలిన వాళ్లకు అది వరంగా మారిందని చెప్పాలి.