తమిళంలో మూడు స్థానికి చేరిన విజయ్ దేవరకొండ… ఆ క్రేజ్ కి కారణం?
పెళ్లి చూపులు మూవీతో తళుక్కున మెరిసి సంచలనం కల్గించిన యువహీరో విజయ్ దేవరకొండ ఇక అర్జున్ రెడ్డి మూవీతో కనీవినీ ఎరుగని స్టార్ డమ్ ఓవర్ నైట్ తెచ్చేసుకున్నాడు. గీత గోవిందంతో వందకోట్ల కలెక్షన్స్ లోకి అడుగుపెట్టిసిన ఈ యువ స్టార్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తన సత్తా చూపిస్తున్నాడు. ఇక తెలుగు లోనే కాకుండా తమిళ ,హిందీ భాషల్లో కూడా అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ అయిపోయి అక్కడా సంచలనం క్రియేట్ చేసింది. నోటా మూవీతో తమిళ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు.
నోటా కోసం విజయ్ చాలా కష్టపడి తమిళం నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా విజయ్ అంటే తమిళ ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చేసింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మాయిల్లో విజయ్ అంటే చెప్పలేనంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక తమిళంలో చెన్నై టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ -2018’ పేరిట నిర్వహించిన ఒక పోల్ లో విజయ్ అనూహ్యంగా థర్డ్ ప్లేస్ లో నిలిచాడు.
యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్ర మొదటి ప్లేస్ లో నిలిస్తే,అథవా మురళి రెండో స్థానం కైవసం చేసుకోగా, మూడో స్థానంలో విజయ్ నిలిచాడు. ఓ తెలుగు హీరోకి తమిళంలో ఇంతటి క్రేజ్ వచ్చిందంటే ఎంతగా విజయ్ ని ఆరాధిస్తున్నారో చెప్పక్కర్లేదు. ధనుష్ , టిప్పు , శివ కార్తికేయన్ వంటి వాళ్ళను కాదని తమిళ ఓటర్లు విజయ్ కి పట్టం కట్టారు.
అందుకే వాళ్లంతా విజయ్ కన్నా వెనుకబడ్డారు. తమిళులు విజయ్ దేవరకొండను ఎంతగా అభిమానిస్తున్నారో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ముందు ముందు ఇంకా విజయ్ ఎన్ని సెన్షేషన్స్ క్రియేట్ చేస్తాడో, ఎంత ఎత్తుకి ఎదుగుతాడో చూడాలి.