Movies

సుకుమార్ ఆఖరి ప్రయత్నం ఫలిస్తుందా?లేక నిరాశ తప్పదా?

సినిమా ఇండస్ట్రీలో ఒకసారి తేడా వస్తే ఇక తేరుకోవడం చాలా కష్టం. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఇబ్బందుల్లో పడాల్సిందే. రామ్ చరణ్ తో రంగస్థలం వంటి బిగ్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీయాలని అనుకున్నాడు. కథను మహేష్ కి నచ్చినట్టు మార్చి మార్చి చెప్పడంలో ఇబ్బంది పడడంతో వచ్చిన ఛాన్స్ పోయింది. ఈ విషయం బయటకు చెప్పుకోలేక పోతున్నాడట. దీంతో ఈ విషయంపై రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి. సొంత నిర్మాణ సంస్థపై దృష్టి పెట్టడం,మహేష్ సినిమా వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం అవమానంగా ఉందట.

సుకుమార్ తో సినిమా చేస్తానని స్వయంగా మహేష్ ప్రకటించి కూడా ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ వైపు అడుగులు వేయడం పట్ల సుకుమార్ కి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడిందట. అయినా సరే చివరి ప్రయత్నం గా మరో కథ వినిపించడానికి సిద్ధం అవుతున్నాడట. అందుకే మహేష్ కి ఫోన్ చేసి కథ చెప్పడానికి సమయం ఇవ్వాలని అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే అనిల్ రావిపూడి వైపు పూర్తి మొగ్గు చూపిస్తున్న మహేష్ నిరాశ పర్చడం ఇష్టం లేక,సుకుమార్ కథ వినడానికి సమయం ఇస్తానని మాట ఇచ్చాడట. నిజానికి సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేష్ హీరోగా సినిమా తలపెట్టింది. అయితే మహేష్ , సుకుమార్ ల మధ్య కథ ఫైనల్ కాకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టెన్షన్ పడుతున్నారట.

ఇప్పటికే వరుస పరాజయాలు చవిచూసిన మైత్రీ మూవీ మేకర్స్ మహేష్,సుకుమార్ మూవీ స్టార్ట్ కాకపొతే ఏంచేయాలి అంటూ మదన పడుతున్నారట. దీనికి తోడు మహేష్,సుకుమార్ లకు ఇప్పటీకే భారీ మొత్తాలను సదరు సంస్థ వాళ్ళు అడ్వాన్స్ గా ఇచ్చారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.