రకుల్ ప్రీత్ సింగ్ గురించి నమ్మలేని నిజాలు… సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేదో?
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ముందుగా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. కెరటం మూవీతో తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో వేగం పెంచేసింది. ఆతర్వాత పెద్ద హీరోల సినిమాలతో దూసుకెళ్తోంది. అందం , అభినయంతో ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఇక బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో బాలయ్య సరసన శ్రీదేవిగా నటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణిస్తూ సామజిక సేవలో కూడా తనదైన ముద్ర వేస్తోన్న రకుల్ 1990 అక్టోబర్ 10న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో పుట్టింది.
ఆమె తండ్రి కుల వీందర్ ,తల్లి రాజేంద్రర్. తండ్రి ఆర్మీ ఆఫీసర్ , తల్లి గృహిణి రకుల్ కి పేరు పెట్టేసమయంలో తల్లిలోని తొలి అక్షరం ర, అలాగే తండ్రి లోని తోలి అక్షరం కు ను కల్పి రకుల్ కి పేరు పెట్టారు. ఈమెకు అమన్ అనే తమ్ముడున్నాడు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో పదవతరగతి వరకూ చదివిన ఈమె ఇంటర్ అయ్యాక ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాథ్స్ బీఎస్సీలో డిగ్రీ అందుకుంది.
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ తన తమ్ముడిని కూడా హీరోగా తీసుకొచ్చింది. తమ్ముడు హీరోగా ఓ సినిమాకు క్లాప్ కూడా కొట్టింది. క్రీడలంటే ఇష్టపడే ఈమె నేషనల్ లెవెల్లో గోల్ఫ్ క్రీడాకారిణిగా ఎదిగింది. గుర్రపు స్వారీ, భరతనాట్యం, యోగ చేస్తుంది. స్విమ్మింగ్, బాస్కెట్ బాల్,వంటివి సాధన చేస్తుంది. హీరోల్లో షారూఖ్ ఖాన్ , క్రీడల్లో నైనా సాహ్ని అంటే ఇష్టమని చెబుతుంది. సినిమాలు చేస్తూనే సామాజిక సేవలో పాల్గొనే ఈమె మహిళలపై జరిగే అకృత్యాలపై దృష్టి సారిస్తుంది.
హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పే ఆమె అక్కడ ఓ ఇల్లు కొనేసుకుంది. చిన్నప్పటినుంచి జిమ్ కి వెళ్లే ఈమె గచ్చీబౌలి,జూబ్లీ హిల్స్ , వైజాగ్ లలో ఫంక్షనల్ సాటిఫై అనే పేరుతొ జిమ్ సెంటర్స్ నడుపుతోంది. ఇక స్టడీస్ సమయంలోనే మిస్ ఇండియాగా ఎంపికయింది. అలాగే పలు టైటిల్స్ అందుకుంది. ఇంటర్ పూర్తయ్యాక పాకెట్ మనీకోసం 2009లో గిల్లీ అనే కన్నడ మూవీలో నటించింది. బృందావన్ కాలేజీగా తమిళంలో కి రీమేక్ చేసారు. అయితే తండ్రి ఆదేశం మేరకు డిగ్రీ పూర్తి చేసి , ఆతర్వాత కెరటం మూవీలో స్టూడెంట్ గెటప్ తో చేసింది.
ఆతర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరురాలేదు. అయితే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో పేరొచ్చింది. ఉత్తమనటిగా ఫిలిం ఫెర్ అవార్డు లభించింది. ఆతర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి యారియాన్ సినిమాలో నటించింది. తెలుగులో హీరో అది పక్కన రఫ్ మూవీ చేసినా అది ఆకట్టుకోలేదు. లౌక్యం మూవీతో గోపీచంద్ సరసన నటించింది. కరెంట్ తీగ చేసాక , మిస్టర్ ఫర్ఫెక్ట్ లో రెండు రోజులు యాక్ట్ చేసాక రకుల్ కి బదులుగా కాజల్ ని తీసుకున్నారు.
చిన్న సినిమాలు చేయడం వల్లనే ఈ సినిమా ఛాన్స్ తప్పించారని అంటుంది. దృవ మూవీతో రకుల్ అందాలను ఆరబోసి యూత్ గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది. నాన్నకు ప్రేమతో మూవీకి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకుంది. సాయి ధర్మ తేజ్ హీరోగా విన్నర్ లో చేసింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో జై జానకి నాయక మూవీలో చేసింది. మహేష్ బాబు హీరోగా స్పైడర్ మూవీ లో మురుగు దాస్ డైరెక్షన్ లో చేసింది.