Movies

మొత్తం బండారం బయట పెడ్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మి పార్వతి

మార్చి 22తేదీ కోసం ఇప్పుడు అందరూ అతృతంగా ఎదురుచూస్తున్నారు. అదేరోజు వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల కానుండడం ఇందుకు కారణం. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది తెలుగు దేశం పార్టీ నాయకుల్లో , ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో ఆసక్తి, టెన్షన్‌ పెరిగిపోతున్నాయి. తాజాగా సినిమాను లక్ష్మీ పార్వతి ప్రత్యేక షోతో చూసింది. ఆమెను సినిమా మెప్పించిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇదే నేపథ్యంలో తాజాగా లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం అందరి బండారాలను బయట పెట్టడం ఖాయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో చంద్రబాబు నాయుడుతో పాటు అప్పట్లో ఎన్టీఆర్‌ కి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి గురించి ఉందని, తప్పకుండా వారందరు ప్రజా కోర్టులో దోషులుగా నిలవడం ఖాయం అని లక్ష్మీ పార్వతి ధీమాగా చెప్పుకొస్తోంది.

లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ వారిలో మరింత టెన్షన్‌కు గురి చేస్తోంది. ఏ విషయాలను ఎలా చూపాలి, వివాదాన్ని ఎలా చేయాలో రామ్‌ గోపాల్‌ వర్మ కి బాగా తెలుసు. నేరుగా చంద్రబాబు నాయుడు పేరును వాడి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లో ఆయనకు సంబంధించిన కొన్ని సీన్స్‌ ఈ చిత్రంలో పెట్టడంతో ఆయన భవిష్యత్తుపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.

ఇంతటి దారుణమైన పరిస్థితి నేపథ్యంలో సినిమాను ఆపేందుకు తెలుగు దేశం పార్టీ వారు ప్రయత్నాలు చేయడం ఖాయం. ప్రస్తుతం చంద్రబాబు ప్రస్తుతం రాజకీయంగా కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. సీఎం అయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబుకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం పెద్ద తలనొప్పి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు.