Movies

పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి

కెరీర్లో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుంటామని హీరోయిన్లు చెబుతుంటారు. కానీ అనుకోకుండా వారికి పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో వివాహం చేసుకొని వారు సెటిల్ అవుతుంటారు. కొంతమంది ఇంకా ముందుగానే పెళ్లి చేసుకొని కూడా సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుని నటిస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తాప్సి మాత్రం పెళ్లి గురించి అడిగితే మాత్రం కస్సుమంటోంది.

సినిమాల్లో సంపాదించిన డబ్బును తాప్సి బాడ్మింటన్ గేమ్స్‌లో వెచ్చిస్తోంది. ఆమె పూణె‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్రాంఛైసి 7 ఏసెస్‌కు కో ఓనర్ . ఇదే సమయంలో అందులో మెంబర్ గా ఉన్న మథియాస్ తో చాలా క్లోజ్‌గా ఉంటోందని వార్తలు వస్తున్నాయి.

దీనిపై తాప్సీని అడిగితే మీడియా తమను తప్పుగా అర్ధం చేసుకుందని వ్యాఖ్యానించింది. అంతేకాదు మథియాస్‌‌తో వివాహం గురించి అడిగితే మీడియాపై విరుచుకుపడింది. తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, ఎప్పుడైతే తనకు ఒక బిడ్డ కావాలని అనుకుంటానో అప్పుడే వివాహం చేసుకుంటా అంటోంది.