Movies

అభినందన్ బయో పిక్….ఏ హీరో నటిస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దేశవ్యాప్తంగా అభినందన్ పేరు మారుమోగిపోతోంది. పాక్ భూభాగంలోకి ప్రవేశించి రెండురోజుల పాటు ఉన్న అతని ధైర్యసాహసాలు, శత్రువులకు లొంగినా సడలని అతని దేశభక్తి బాలీవుడ్ హీరోలకు స్ఫూర్తిని నింపుతోంది. అభినందన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో దిగ్గజ ఫిలింమేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

ప్రముఖ ఆడియో సంస్థ టి-సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అభినందన్ బయోపిక్‌కు అభిషేక్ కపూర్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అభినందన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారన్న దానిపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది.

జాన్ అబ్రహాం అభినందన్ పాత్ర పోషిస్తారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అభినందన్ లాంటి రియల్ హీరో పాత్రను చేయమని ఎవరైనా అడిగితే నిస్సందేహంగా చేస్తానని స్పష్టం చేశాడు జాన్ అబ్రహాం. దీంతో ఈ పాత్రకు జాన్ అబ్రహాం కరెక్ట్ అంటున్నారు. ఒక్క సంఘటనతో అభినందన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఈ బయోపిక్ త్వరగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి విడుదలచేస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?