Movies

సావిత్రి ఇంట్లో పని వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసా?

ఎన్టీఆర్ ,అక్కినేనిలకు ధీటుగా మహానటి సావిత్రి ఎదగడమే కాదు ఆస్తుల విషయంలో కూడా మహారాణిగా ఎదిగింది. ఆమె ఇల్లు ఓ మహారాణి హాలు లా ఉండేదట. ఎందరో పనివాళ్ళు , ఇంట్లోనే నగలు తయారు చేసే వాళ్ళు,ఇలా ఆమె ఇల్లు వైభవంగా వెలుగొందేది. అయితే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. మహానటి సినిమా వచ్చాక జనానికి కొన్ని విషయాలు తెలిసాయి. అందులో ఓ పనివాడు ఆమెను మోసం చేసినట్లు చూపించారు. ఒక అభిమాని ఆమె ఇంట పనివాడుగా చేరి , ఆతర్వాత అదను చూసి మోసం చేసినట్లు ఆ సినిమాలో చూపెట్టారు. అయితే అది సినిమా టిక్ కోసం తప్ప అలా ఆమెని మోసం చేసిన పనివాళ్ళు లేరని సన్నిహితులు చెప్పేమాట.

సావిత్రికి గల భారీ భవంతిలో అటు ఇటు గదులు, మధ్యలో కార్లు ఉండేవి. కార్లకు డ్రైవర్లు,వాళ్ళ కుటుంబాలు ఇలా సావిత్రి వైభవం వారించడానికి సరిపోదు. షూటింగ్ కి వెళ్తే,రెండు కార్లతో వెళ్లేవారట. ఇక షూటింగ్ నుంచి నేరుగా కారులోనే బెడ్ రూమ్ కి వచ్చేసేవారట. ఇంటి నిండా జనం. ఎటు చూసినా తాను,తన భర్త జెమిని గణేశన్ ఫోటోలు కనిపించాల్సిందే.ఇక నౌకర్లు,చాకర్లు ఒకరా ఇద్దరా ఎందరో ఉండేవారు. నగలు కూడా ఇంట్లోనే తయారుచేసే విధానం ఏ నాటికీ లేరంటే అతిశయోక్తి కాదు. వెండి , బంగారు జరీ చీరలు నేసేవాళ్ళు ఆమె ఇంటికి వచ్చేవారు.

చెన్నైలో భవంతులు, కోడై కెనాల్ లో ఎస్టేట్, హైదరాబాద్ లో ఆస్తులు,సొంతూళ్లో మిల్లు ఇలా లెక్కలేనన్ని ఆస్తులు ఆమె సొంతం. బస్తాలతో డబ్బులు వచ్చిపడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక ఆమె ఓ పెళ్ళికి వెళ్తుంటే ఓ వెండి బిందె వెళ్లాల్సిందే. అదీ ఆమె స్టేటస్. అయితే జెమిని గణేశన్ ప్రవర్తన ఆమెను బాధించేదట. నిజానికి సావిత్రిని పెళ్లాడే సమయానికి ఇద్దరితో పెళ్లయింది. వాళ్లకు పిల్లలున్నారు. ఈమెది మూడోపెళ్లి. ఇక కొత్త హీరోయిన్స్ తో తిరగడం. తన డబ్బుని అతడి భార్య పిల్లలకు ధారపోసిన అడిగేది కాదట. కానీ మాట తప్పడంతో తీవ్రంగా బాధపడుతూ మనసు విరిగిపోయింది.

వాళ్ళను విధిలేని పరిస్థితిలో పెళ్లాడాను కానీ ప్రేమించింది నిన్నే అంటూ చాముండేశ్వరి గుడిలో చేసిన ప్రమాణం వమ్ము చేయడాన్ని సహించ లేకపోయింది. ఇక దీపావళి వస్తే చాలు ఆ భవంతిలో జరిగే వేడుకలు రాజమహల్ ని తలపించేవట. దీపావళి వేడుకలు పనివాళ్ళందరికీ బట్టలు పెట్టడం ఆనవాయితీగా ఉండేదట. అడిగిన వాళ్లకు అడిగినట్లు సాయం చేసేవారు. వారి ఇళ్లల్లో పెళ్లిళ్లకు శుభ కార్యాలకు బట్టలు,మంగళసూత్రం బహుమతిగా ఇచ్చేవారు.

సావిత్రి వటవృక్షంలో కూలిపోయినా అందరూ సెటిల్ అయ్యారు. భర్త తో వచ్చిన విభేదాలే ఆమె వైభవాన్ని కాల్చుకు తింది. సావిత్రి కి సొంతం జనం లేక, అటు జెమిని గణేశన్ కూడా సరిగ్గా లేక ఆమె సంస్థానం హరించుకుపోయింది. అయితే పనివాళ్లను ఏనాడు పనివాళ్లుగా చూడలేదు. ఇక ఆమె ఇంట్లో ఓసారి ఏడువారాల నగలు కనిపించలేదట. అందరూ కంగారు పడుతుంటే, పొతే పోయాయి వాటినే పట్టుకుని ఊరెగ్గద్దు అన్నారట సావిత్రి. అంతేకాదు,ఇంట్లో వాళ్ళు ఎవరో తీసి వుంటారు,కనిపించకపోతే కంగారెందుకు అంటూ కొట్టిపారేశారట.