Movies

మధుప్రియ రియల్ లైఫ్…. ప్రేమించి పెళ్లి చేసుకున్న మధుప్రియ ఇప్పుడు ఎలా ఉందో?

కొందరికి పుట్టుకతోనే కళలు అబ్బుతాయి. ఆవిధంగా పాటే ప్రాణంగా చిన్నప్పటినుంచి భావించిన మధుప్రియ ‘ఆడపిల్లనమ్మా ‘సాంగ్ తో చిన్నప్పుడే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఫిదా మూవీలో ‘వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే” సాంగ్ తో మధుప్రియ ఉన్నత శిఖరానికి చేరింది. 1997ఆగస్టు 26న కరీం నగర్ జిల్లా గోదావరి ఖనిలో నిరుపేద కుటుంబానికి చెందిన మల్లేష్ , సుజాత దంపతులకు రెండవ సంతానంగా జన్మించింది. మల్లేష్ సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడిగా పనిచేసేవాడు. తల్లి వ్యవసాయ పనులకు వెళ్లి ముగ్గురు ఆడపిల్లలను పోషించింది. కృష్ణాష్టమి నాడు ఆడపిల్ల జన్మిస్తే మంచిదికాదన్న సామెత ఉంది.

అయితే అదే రోజు మధుప్రియ పుట్టి, సింగర్ గా పాపులర్ అయింది. ఆమె అక్క తెలుగు మీడియంలో చదివితే ఈమె ఇంగ్లీషు మీడియంలో చదివింది. ఈమెకి ఓ చెల్లి కూడా ఉంది. మాస్టర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి,ప్రస్తుతం లా చేస్తోంది. మధుప్రియ చిన్నప్పుడు ఆమె పేరెంట్స్ , తాతయ్య పాటలు పాడేవారు. ఆవిధంగా తనుకూడా పాటలు నేర్చుకుని ఫంక్షన్స్ లో పాటలు పడేదాన్నని,ఒకవేళ ఎవరూ అడగకపోయినా తానె ఏరికోరి పాటలు పడేదాన్ని అని మధుప్రియ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.

మొదట డాక్టర్ కావాలని ఉండేదని, అయితే సింగర్ మారాలని లక్ష్యం ఎంచుకున్నానని పేర్కొంది. 5వ తరగతి సమయంలో ఆడపిల్లనమ్మా పాటను స్వయంగా రాసి పాడడం ద్వారా అందరిని ఆశ్చర్య పరిచింది. తద్వారా వెలుగులోకి వచ్చింది. ఆపాటతో అందరి గుండెల్లో చేరిన ఆమె జిల్లా, మండల స్థాయిల్లో పాటలు పాడి,అవార్డులు,బహుమతులు అందుకుంది.

మాటీవీలో సూపర్ సింగర్స్ ద్వారా తన గళాన్ని మరింత అభివృద్ధి చేసుకుని తన గానాన్ని ప్రజలకు చేరువ చేసింది. మధుప్రియ గళాన్ని చూసి చాలా టివిలు ఇంటర్యూ కి పోటీపడ్డాయి. ఇక ముకుంద ముకుంద అనే పాటతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా తమ్ముడా అంటూ తనగళాన్ని వినిపించింది. ప్రజా గాయకుడు గద్దర్ తో కల్సి 22రోజులపాటు ప్రజాశాంతి ఉద్యమంలో మధుప్రియ పాల్గొంది. తెలంగాణా, బతుకమ్మ పాటలు చాలానే పాడింది.

హైద్రాబాద్ నల్లకుంటలో నివాసం ఉండే సమయంలో ఇంటి సమీపంలో శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడడం, అది ప్రేమకు దారితీసింది. ఇక మధుప్రియకు 18ఏళ్ళ ప్రాయంలో శ్రీకాంత్ ని పెద్దల సమక్షంలో పెళ్లాడింది. ఆతర్వాత ఇద్దరి మధ్యా గొడవలు జరిగినా తర్వాత సర్దుమణిగింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా మూవీలో ‘వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే” సాంగ్ పాడి ఉత్తమ గాయనిగా ఫిలిం ఫేర్ అవార్డు కొట్టేసింది. మహిళలు ఈ పాటకు చిందులు వేసేలా చేసింది.

రవితేజ మూవీస్ నేల టికెట్, టచ్ చేసి చూడు సినిమాల్లో పాటలు పడింది. బిగ్ బాస్ సీజన్ వన్ రియాల్టీ షోలో పాల్గొన్న మధుప్రియ కొన్ని రోజులకే ఎలిమినేట్ అయింది ఇక జీవన పోరాటంలో కష్టపడితేనే సమాజం గుర్తిస్తుందని, లేకుంటే ఎవరూ గుర్తించరని మధుప్రియ అభిప్రాయం వ్యక్తంచేసింది.