Movies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? నమ్మలేని నిజాలు

నందమూరి వంశంలో అచ్చుగుద్దినట్లు నటరత్న పోలికలను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి,నిన్ను చూడాలని మూవీతో వెండితెర హీరోగా పరిచయం అయ్యాడు. చిన్నప్పటి నుంచి కూచి పూడి నృత్యం నేర్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో వేసే స్టెప్స్ కిక్కెక్కిస్తాయి. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ఓ పక్క హిట్ , మరో పక్క ప్లాప్ టాక్స్ అందుకుని తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 1983మే20న నందమూరి హరికృష్ణ , షాలిని దంపతులకు జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ విద్యారణ్య హైస్కూల్ లో చదువుకున్నాడు.

హైదరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసాడు. చిన్నప్పటి నుంచి కలివిడితనం గల తారక్ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ అందరితో బంధాలు కొనసాగిస్తాడు. ఇతర హీరోల ఆడియో ఫంక్షన్స్ కి వెళుతూ హీరోలంతా ఒక్కటేనని ఒకరికోసం మరొకరు గొడవలు పెట్టుకోవద్దని ఫాన్స్ కి చెబుతూ ఉంటాడు. ఎన్టీఆర్ వారసత్వాన్ని సినిమాల్లో కొనసాగించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన పేరుని నిలబెడుతున్నారు. ఎన్టీఆర్ డైరెక్షన్ లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా తారక్ ని పరిచయం చేసారు.

నిన్ను చూడాలని వుంది మూవీతో హీరోగా వచ్చి,ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఆది బ్లాక్ బస్టర్ అయింది. నంది, ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న తారక్ కి ఫాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ విజయంగా సింహాద్రి నిల్చింది. ఆతర్వాత కొన్ని సినిమాలు ఆడకపోవడం , లావెక్కడన్న విమర్శలు రావడం నేపథ్యంలో రాఖి మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఇక ఆతర్వాత సన్నబడ్డానికి కొవ్వు తీయించుకోవడంతో యమదొంగ సినిమా రాజమౌళి సినిమాలో క్యూట్ గా కనిపించాడు. ఇది విజయాన్ని నమోదుచేసుకుంది. ఇక పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీ రికార్డులను బద్దలు కొట్టింది. ఆతర్వాత 25వ చిత్రం నాన్నకు ప్రేమతో మూవీతో 100కోట్ల క్లబ్ లో చేరాడు. జై లవకుశ,జనతా గ్యారేజ్,అరవింద సమేత చితాలతో మంచి విజయాన్ని నమోదుచేసుకున్నాడు.
ఇక 2009లో టిడిపి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి తన వాగ్దాటితో ప్రజల ప్రశంసలు అందుకున్నాడు.

అయితే ప్రచారంలో పాల్గొని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తారక్ మళ్ళీ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టలేదు. బోరో ప్లస్ పౌడర్,నవరత్న ఆయిల్, జండూ బామ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. సెలెక్ట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. తెలుగులో బిగ్ బాస్ ప్రోగ్రాం కి తొలి హోస్ట్ గా వ్యవహరించి రక్తికట్టించాడు. 2011మే5న ఎన్టీఆర్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ లో లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నాడు.ఎన్టీఆర్,ప్రణతి దంపతులకు అభయ్ రామ్,భార్గవ రామ్ అనే ఇద్దరు కుమారులున్నారు.

ఇక అరవింద సమేత వీర రాఘవ మూవీ చేస్తున్న సమయంలో తారక్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అయితే తండ్రి మరణించిన 5రోజులకే షూటింగ్ కి హాజరయిన తారక్ తన తండ్రి చెప్పిన మాటలను ఆచరణలో పెట్టారు. అందుకే నిర్మాత, దర్శకులను షూటింగ్ విషయంలో ఇబ్బంది పెట్టకూడదని వెంటనే షూటింగ్ కి వెళ్ళాడు. ఇక తన కుటుంబంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎవరి ఇంట్లో జరగకూడదని అందుకే జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని తారక్ చెబుతూ ఉంటాడు.