పద్మనాభం భార్య కూడా ఒక నటి అన్న సంగతి తెలుసా? చివరి రోజుల్లో ఎన్ని పాట్లు పడ్డారో?
ఆరోజుల్లో స్టార్ కమెడియన్ గానే కాకుండా కరుణ రసం పలికించే పాత్రల్లో సైతం మెప్పించిన నటుడు ఎవరంటే పద్మనాభం అని చెప్పాలి. అంతేకాదు మంచి చిత్రాలను పెద్ద హీరోలతో తీసిన నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో పద్మనాభాన్ని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటాడు. ఆకలేది అన్నమడిగితే పిచ్చోళ్ళు అన్నారు నాయాళ్ళు అనేపాట పద్మనాభం లోని గొప్ప నటుణ్ని చూపిస్తుంది. దాదాపు 400చిత్రాల్లో నటించిన పద్మనాభం 8మూవీస్ కి దర్శకత్వం వహించాడు. అయితే ఆఖరి రోజుల్లో దుర్భర జీవితం అనుభవించాడు.
పద్మనాభం అసలు పేరు బసవరాజు వెంకట పద్మనాభ రాజు. 1931ఆగస్టు 20న పుట్టిన పద్మనాభం 12 ఏళ్ళప్రాయంలోనే అప్పటి దర్శక దిగ్గజం గూడవల్లి రామబ్రహ్మం మాయలోకం సినిమా ద్వారా నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. తర్వాత 80మంది డైరెక్టర్స్ దగ్గర పనిచేసాడు. గూడవల్లి రామబ్రహ్మం మొదలు,కెవి రెడ్డి, ఎల్వి ప్రసాద్ లాంటి దిగ్గజాలున్నారు. ఇక ఎందరినో తెలుగు తెరకు పరిచయం చేసాడు. అలా పద్మనాభం ద్వారా పరిచయం అయినవాళ్లలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఒకరు.
పద్మనాభం తీసిన మర్యాదరామన్న,కథానాయిక మొల్ల వంటి మూవీస్ లో పాడడం ద్వారా ఎస్పీ బాలు తారాస్థాయికి చేరారు. ఎన్టీఆర్ తో దేవత లాంటి సూపర్ హిట్ మూవీ పద్మనాభం నిర్మించారు. పొట్టి ప్లీడర్ ,మొల్ల వంటి మూవీస్ తీసిన పద్మనాభం రేఖ – మురళి అనే సంస్థ నెలకొల్పడం ద్వారా ఎందరికో అన్నం పెట్టిన ఘనత పద్మనాభంకే దక్కుతుంది. ఇలా తన ఆస్తులన్నీ కరిగిపోయాయి.ఇక అప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా అవ్వడంతో ఒక కొడుకు,ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే వీళ్ళెవరూ పద్మనాభాన్ని పట్టించుకోలేదు.
ఇక చివరి రోజుల్లో ప్రమీల అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో సహజీవనం చేసాడు. అయితే ప్రమీలకు ఇచ్చిన చిన్న ఇల్లు మిగిలింది. అయినా అప్పులు వెంటాడాయి. ప్రమీల డబ్బింగ్ చెప్పగా వచ్చిన జీతంతో పద్మనాభాన్ని పోషించేది. ఒకదశలో తనకు ఇవ్వాల్సిన నలభై వేలు ఇవ్వాల్సిందిగా నటుడు రాజబాబు అడగడంతో మిగిలిన చిన్న ఇంటి పత్రాలు ఇచ్చి బాకీ జమకట్టుకోమనడంతో, నిలువ నీడ లేకుండా చేసేంత పాపం నాకెందుకు అంటూ రాజబాబు వెళ్లిపోయారట.
ఇక హరినాధ్ కూడా శ్రీరామ కథ చిత్రానికి ఇవ్వాల్సిన డబ్బు అడిగేసరికి అవే ఇంటి పత్రాలు ఇవ్వబోతే,ఒక ఆడదాని ఆస్తిని తెగనమ్మి అప్పు తీర్చుకునేంత దుర్మార్గుణ్ణి కాదని హరినాధ్ అనడం కూడా కరుణ రసంగా నిలిచిపోయింది. అప్పటి విలువలు అలాంటివి మరి. అత్యంత దయనీయంగా చివరి రోజులను గడిపిన పద్మనాభం ఏక్ నిరంజన్, భద్ర లాంటి మూవీస్ లో నటించాడు.