కమెడియన్ పృథ్వి సినిమాల్లోకి రాకముందు చేసేవాడో తెలుసా? నమ్మలేని నిజాలు
ఖడ్గం మూవీలో థర్టీ యియర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిన కమెడియన్ పృథ్విరాజ్ దాదాపు 200సినిమాల్లో చేసి స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. ప్రజాసేవకోసం ఇప్పుడు రాజకీయాల్లో చేరాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 1964ఆగస్టు 6న జన్మించిన పృథ్వి రాజ్ అసలు పేరు పృథ్వి నాయుడు. తండ్రి సుబ్బారావు రేల్వే స్టేషన్ మాస్టర్ గా పనిచేసారు. అంతేకాదు మోహన్ బాబు,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి వంటివాళ్లతో కల్సి 60సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా పనిచేసారు. తండ్రి సినిమాలకోసం చెన్నైలో ఉంటె, పృథ్వి తాడేపల్లిగూడెంలో తల్లి దగ్గర ఉంటూ ఇంటర్ వరకూ అక్కడే చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లి నటుడు ప్రభాకరరెడ్డిని కలిస్తే,పిజి పూర్తిచేసి రమ్మనడంతో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం ఏ ఎకనామిక్స్ చేసారు.
చిన్నప్పటినుంచి క్రీడల్లో రాణిస్తూ క్రికెట్ టోర్నమెంట్స్ లో పాల్గొని కప్ లు కూడా గెలిచాడు. పృథ్వికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి ఉండగా ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పిజి పూర్తయ్యాక 1992లో చెన్నై వచ్చిన పృథ్వికి ఒక హోటల్ లో మేనేజర్ గా ప్రభాకర రెడ్డి ఉద్యోగం ఇప్పించారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో బ్యాంకు మేనేజర్ పాత్ర ఇప్పించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రావు గోపాలరావు మేనల్లుడి గా ఆసినిమాలో చేసిన పృథ్వికి నటనలో ప్రభాకర రెడ్డి నటనలో మెళుకువలు నేర్పించారు.
ఇక ఆతర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే రావడంతో కొన్నాళ్ల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే తల్లి చనిపోవడంతో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. అదేసమయంలో కృష్ణవంశీ తీస్తున్న సింధూరం మూవీలో ఛాన్స్ దొరికింది. నక్సలైట్ పాత్రలో చేసినా గుర్తింపు రాలేదు. దేవుళ్ళు ,సముద్రం ,గణేష్,బాచి,గండికోట రహస్యం,ప్రేమఖైది వంటి సినిమాల్లో చేసినా, ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో నిరాశ చెందాడు. ఇక అదేసమయంలో బాపు డైరెక్షన్ లో టివిలో ప్రసారమైన సీరియల్ లో ఏడేళ్ల పాటు పృథ్వి పనిచేసాడు.
ఇంద్రుడు,దుర్యోధనుడు వంటి పాత్రలతో ఆడియన్స్ కి చేరువయ్యాడు. తరువాత చంద్రలేఖ,ఇడియట్ మూవీస్ లో చేసిన పేరు రాలేదు. అయితే 2002లో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఖడ్గం మూవీతో పాపులర్ అయ్యాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,పోకిరి,ఢీ, రెడీ,కిక్,కరెంట్ ,నమో వేంకటేశ ,పూలరంగడు,నువ్వు నేను,గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సెల్ఫీ రాజా లాంటి లాంటి మూవీస్ లో నటించిన పృధి లౌక్యం మూవీలో బాలీవుడ్ స్టార్ బబ్లూ పాత్రతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.
బాబు బంగారం,చుట్టాలబ్బాయి,జక్కన్న,అత్తారింటికి దారేది,ఎక్కడికి పోతావ్ చిన్ని వాడా, మీలో ఎవరు కోటీశ్వరుడు,ఖైదీ నెంబర్ 150, శైలజారెడ్డి అల్లుడు,వినయ విధేయ రామ,లాంటి మూవీస్ చేసాడు. సినిమాల్లో చిరంజీవితో పరిచయం ఏర్పడడం,నటుడిగా ప్రోత్సహించడంతో ప్రజారాజ్యం పార్టీకి ఓ కార్యకర్తగా ప్రచారం చేసాడు. అయితే మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయిన పృథ్వి రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చేయడంలేదంటూ వైకాపాలో చేరారు. జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్న పృథ్వి వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.