హీరో సూర్య,కార్తీ సిస్టర్ ఏమి చేస్తుందో తెలుసా… నమ్మలేని నిజాలు
సినిమాల్లో అన్నదమ్ములు హీరోలుగా రాణించడం చాలా అరుదు. అందునా హిట్ సినిమాలతో దూసుకుపోవడం ఈరోజుల్లో చాలా కష్టమే. అయితే తమిళ నటులుగా రాణిస్తూ తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలతో కూడా డిఫరెంట్ మూవీస్ తో సూర్య,కార్తీక్ దుమ్మురేపుతున్నారు. నిజానికి వీరి తండ్రి శివకుమార్ కూడా మంచి నటుడే. ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి హేమాహేమీలతో నటించాడు. తెలుగులో నటుడు మురళీమోహన్ మాదిరిగా మంచి పాత్రలతో శివకుమార్ తమిళంలో మంచి నటుడుగా ముద్రపడ్డారు. స్టార్ డమ్ లేకపోయినా శివకుమార్ తన ఇద్దరు కొడుకులు స్టార్ డమ్ తెచ్చుకోవడం ఆయనకు ఆనందంగా ఉంది. ఇక సూర్య,కార్తీక్ తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చకుని జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
తెలుగులో ఊపిరి మూవీలో నాగార్జున తో కల్సి కార్తీ నటించి మంచి మార్కులు కొట్టేసాడు. అయితే దేవ్ లాంటి సినిమాలు తమిళంలో ప్లాప్ అయినా, కెరీర్ ఏమాత్రం బ్రేక్ అవ్వలేదు. ఇక హిట్ మూవీస్ తో సూర్య కెరీర్ వేగం పుంజుకుంది. ఇక సూర్య భార్య జ్యోతిక కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఫాన్స్ ఆమెను జో అని ముద్దుగా పిలుచుకుంటారు.
తాజాగా బృంద అనే కళాకారిణి కూడా శివకుమార్ ఇంటినుంచి రంగప్రవేశం చేసింది. సూర్య ,కార్తీక్ ల ముద్దుల చెల్లెలు బృంద పాడిన ఓ పాటకు గలాటా డాట్ కామ్ నుంచి అవార్డు పొందింది. లింగ స్వామి వంటి డైరెక్టర్ ద్వారా ఈ అవార్డు పొందడం మరీ గ్రేట్ అయింది. బృంద ఇలా అవార్డు పొందడం పట్ల జ్యోతిక చాలా ఆనందం వ్యక్తంచేస్తోంది. నిజానికి మన ఫామిలీ అంతా సినిమాల్లో రాణిస్తున్న నేపథ్యంలో బృంద బాగా పాడుతున్నందున ఆమె కు ఓ ఛాన్స్ ఇప్పిద్దామని సూర్యతో జ్యోతిక అందట.
అయితే తామంతా స్వశక్తితో ఎదిగామని , మమ్మల్ని ఎవరూ రికమండ్ చేయలేదని సూర్య అన్నాడట. అయితే బృంద పట్టుదలతో పాటలు పాడుతూ సోదరులకు తగ్గ సోదరిగా నిలిచిందని జ్యోతిక చెప్పుకొచ్చింది. ఈ అవార్డు తనకు దక్కడం సోదరుల అభిమాన గణం కారణంగా బృంద పేర్కొంటూ కృతజ్ఞతలు చెబుతోంది.
అయితే కొడుకులకన్నా కూతురే ముందుగా సినిమాల్లోకి వచ్చిందని,ఇప్పుడు మంచి స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని శివకుమార్ అంటున్నాడు. సూర్య పెళ్లయ్యాక మరింత సాఫ్ట్ అయ్యాడని , ఇక అందరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ సరదాగా ఉండేవాళ్లమని బృంద చెప్పింది. కార్తీ అంటే తనకు ఇప్పటికీ భయమేనని అంటోంది.