కార్తీక దీపం ఫెమ్ సౌర్య బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…ఆమె తండ్రి ఎవరో తెలుసా?
తెలుగు టివి రంగంలో సీరియల్స్ లో పెద్ద వాళ్ళే కాదు పిల్లలు కూడా బాగా ఆకట్టుకుంటున్నారు. అవార్డులు కూడా దక్కించుకుంటున్నారు. అదే వరుసలో ప్రస్తుతం బావా మరదలు,అక్క మొగుడు ,కార్తీకదీపం సీరియల్స్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు కృతిక 2018లో బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు కొట్టేసింది. నందమూరి బాలయ్య నటించిన జయసింహ మూవీలో కూడా ఈమె దర్శనమిచ్చింది. ప్రముఖ సీరియల్ నటులు సీతా కాంత్ ,స్వప్నల కూతురు గా ఈమె అష్టాచెమ్మా సీరియల్ లో కనిపించింది. ఆ సీరియల్ లో ఈమె పెద్దయ్యాక పాత్రను మౌనిత చేసింది. గోపికమ్మ,దేవయాని అనే సీరియల్స్ లో కూడా కృత్తిక కనిపించింది.
జీ టీవీలో గీతాంజలి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం ఐన కృత్తిక ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. శౌర్య పాత్రలో నటిస్తున్న ఈమెను రౌడీ అని అందరూ ముద్దుగా పిలుస్తున్నారట. ఈమె మాటలు వినడానికే ఈ సీరియల్ ఎక్కువమంది చూస్తున్నారంటే అతిశయోక్తి లేదంటున్నారు. కళ్ళతో భావాలు పలికిస్తుందని అంటున్నారు. ఈ సీరియల్ లో ‘ నేనెవరనుకున్నావ్ మా అమ్మ కూతురిని’ అనే డైలాగ్ వైరల్ అయింది.
ఈమెను రష్మిక మందన్న లా ఉన్నవని, జూనియర్ దివ్యభారతి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారట. చైల్డ్ ఆర్టిస్టుగా కృతికకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బిగ్ బజార్ నిర్వాహకులు 2016లో ఈమెను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. బిగ్ బజార్ టీమ్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా అందులో విజేతలకు కృత్తిక చేతులమీదుగా బహుమతులను అందజేసారు.
ఇక ఆర్పీ పట్నాయక్ తీస్తున్న షార్ట్ ఫిలిం లో ఛాన్స్ కూడా దక్కించుకున్న కృతిక 2017లో స్టార్ మహిళ ప్రోగ్రాం లో కూడా పాల్గొంది. సుమ అప్పట్లో ఈమె చొరవను అభినందించారు. కాగా2017జూన్ లో వచ్చిన రాక్షసి అనే హారర్ మూవీలో ఓ విభిన్న పాత్రలో కనిపించింది. ఇటీవల కృతిక తన పుట్టినోజు వేడుకలను 200మంది అనాధ పిల్లల మధ్య జరుపుకుంది.