Movies

అలనాటి కమెడియన్ పాకీజా ఇప్పుడు అనాధ గా మారిందా? నమ్మలేని నిజాలు

తమిళనాట రాజకీయాల్లో వెరైటీగా ఉంటాయి. కరుడుగట్టిన అభిమానులు ఉంటారు. ఓ మోస్తరుగా అభిమానం చూపేవాళ్లు ఉంటారు. అన్నా డీఎంకే లో ఎంజీఆర్ తర్వాత అంతటి పాపులారిటీతో తమిళనాడు సీఎం గా జయలలిత తనసత్తా చాటారు. ఆమెకు వీరాభిమానులు ఉండేవారు. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. తమ నాలుకలు సైతం కోసి ఇచ్చేస్తారు. అంతగా వీరాభిమానం చాటేవారు ఉండేవారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఎదురైంది. జయలలిత మరణం తర్వాత తమను పట్టించుకునే నాధుడు లేక ఇలాంటి అభిమానులంతా అనాథలయ్యారు. ఇందులో ముఖ్యంగా వాసుకి ఒకరని చెప్పాలి.

ఈమెకు ఈ పేరు పెట్టింది స్వయంగా తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్. ఆయన తర్వాత జయకు ఆమె వీరాభిమానిగా మారి కరుడుగట్టిన అభిమానులకు నాయకత్వం వహించింది. ఇంతకీ వాసుకి ఎవరో కాదు తెలుగునాట కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన పాకీజా గుర్తుంది కదా. అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్ర వేసి,అదే పేరుతొ పాపులర్ కమెడియన్ గా రాణించింది. ఏకంగా 20సినిమాల్లో తెలుగు వారికి బాగా కనెక్ట్ అయిపొయింది.

అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా అంటే ఆమెను ఓ సైన్స్ టీచరేమో అని బ్రహ్మానందం అనుకుంటాడు. తీరా చూస్తే , దొడ్లు కడిగే పాకీజా అని తెల్సి బిత్తర బోతాడు. అలా ఆ ఒక్క సినిమాతో తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న కమెడీయన్ వాసుకి అదే పేరుతొ తెలుగునాట పాపులర్ అయింది. తమిళనాడులో సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ ఇలాంటి వీరాభిమానులు అక్కర్లేదని ప్రకటించేసారు.

డీఎంకే లో ఇలాంటి కరుడుగట్టిన అభిమానులు తక్కువే. పైగా పెద్దగా విలువు ఉండదు.శశికళ చూస్తే జైలులో ఉంది. దినకరన్ పార్టీ ఇంకా పుంజుకుంటుందో లేదో తెలీదు. దీంతో వాసుకి లాంటి వాళ్లకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారింది. నిజానికి సినిమాల తర్వాత జయభేరి పేరిట అభిమాన సంఘం పెట్టి జయలలిత వీరాభిమానులకు వాసుకి నాయకత్వం వహించింది. నాలుకలు కూడా కోసి ఇచ్చేసే కరుడుగట్టిన వీరాభిమానులు ఆ సంఘంలో ఉండేవారు.

ఇక జయలలిత హాస్పిటల్ లో ఉన్న సమయంలో వాసుకి సారధ్యంలో అభిమానులు రోజూ చేసిన పూజలు గానీ మరొకటి గానే చెప్పక్కర్లేదు. అయితే ఇన్నాళ్లూ జయపేరు చెప్పుకుని హాయిగా బతికేసిన ఇలాంటి వాళ్ళు ఇప్పుడు జయ మరణంతో పాపం ఆదుకునే వాళ్ళు లేక అనాథలయ్యారు.