మహేష్,ప్రభాస్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అలనాటి విలన్ చరణ్ రాజ్
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లలో ఛాన్స్ లు వచ్చినవాళ్లు కొందరు, ఛాన్స్ లు రానివాళ్లు మరికొందరు , ఇక ఛాన్స్ లు వచ్చినా నిలబెట్టుకోలేని వాళ్ళు కొందరైతే, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పైకి ఎదిగిన వాళ్ళు మరికొందరు. అలా ఎదిగిన వాళ్లలో 1990 దశకంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన క్యారెక్టర్ నటుడు చరణ్ రాజ్ ఒకరు. తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో మంచి ఆర్టిస్ట్ గా దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చరణ్ రాజ్ విలన్ గా, క్యారెక్టర్ ఆరిస్టుగా తన నటనతో మెప్పించాడు.
అయితే తెలుగులో ఎన్టీఆర్,కన్నడలో రాజ్ కుమార్ తో నటించాలన్న కోరిక తీరలేదని చెబుతాడు. మంచి ఛాన్స్ లు వస్తే తెలుగులో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. కర్ణాటకలోని బెల్గామ్ కి చెందిన చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద. అందరూ ముద్దుగా బ్రహ్ము అని పిలిచేవారట. అయితే సినిమాల్లోకి వచ్చాక చరణ్ రాజ్ గా పేరు మార్చుకున్నాడు. ‘రెబల్ స్టార్ కృష్ణంరాజు భోజన ప్రియుడు. ఆయన సినిమాల్లో నటించే తోటి నటీనటులందరికీ లంచ్ వాళ్ళింటి నుంచే వస్తుంది.
చేపల దగ్గర నుంచి అన్ని వెరైటీస్ వస్తాయి. ఇక ప్రభాస్ కూడా ఈ పద్దతి ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. కృష్ణంరాజు లాగే ప్రభాస్ కూడా మంచి మనసున్న వాడు. ఇక బాహుబలితో ఇంటర్ నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ తో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా. టాలీవుడ్ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసాడు. అతడు ఇలాగే కొనసాగితే ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు ‘అని చరణ్ రాజు వివరించాడు.
అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చరణ్ రాజ్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాల్లో నటించానని, మహేష్ చిన్నప్పుడు నటించిన సినిమాల్లో తాను చేసానని చెప్పుకొచ్చాడు. ‘రజనీకాంత్ తర్వాత డైరెక్టర్స్ కి పూర్తి స్వేచ్చ ఇచ్చే వ్యక్తి మహేష్ బాబు. ఇక మహేష్ అందం చూస్తే మగవాళ్ల మైన తమకే ఏదోలా ఉంటుంది. పెద్ద స్టార్ అయినా సరే డౌన్ టు ఎర్త్ మనిషి. అందుకే అంతటి స్టార్ డమ్ వచ్చింది’అని చరణ్ రాజ్ వివరించాడు.